close

తాజా వార్తలు

సిటీ బ్యాంకుకు రూ.3 కోట్ల జరిమానా

సిటీ బ్యాంకుకు రూ.3 కోట్ల జరిమానా

ముంబయి: అమెరికా ప్రధాన కేంద్రంగా సేవలు అందించే సిటీ బ్యాంకుకు భారతీయ రిజర్వు బ్యాంకు రూ.3 కోట్లు జరిమానా విధించింది. సమర్థులైన డైరెక్టర్లను నియమించాలని, సరైన అర్హతలుండాలని ఆర్బీఐ గతంతో బ్యాంకును ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించక పోవడంతో బ్యాంకుకు జరిమానా విధించారు. వినియోగదారుల లావాదేవీలతో ఈ జరిమానాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్బీఐ వెల్లడించింది.

‘సిటీ బ్యాంకుకు 2019, జనవరి 3న ఆర్బీఐ రూ.3 కోట్లు జరిమానా విధించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు డైరెక్టర్ల నియామకంలో నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణం’ అని రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. అక్రమ నగదు చెలామణి, కేవైసీ ఉల్లంఘనలను సంబంధించి జులై 2013లోనూ సిటీబ్యాంకుకు ఆర్బీఐ హెచ్చరిస్తూ లేఖ రాసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.