close

తాజా వార్తలు

వర్మకు ఆ అవకాశం ఎందుకివ్వలేదు?

ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని భయమా?

అధికార పత్రిక సంపాదకీయంలో ప్రశ్నించిన శివసేన

వర్మకు ఆ అవకాశం ఎందుకివ్వలేదు?

ముంబయి: ఎన్డీఏ మిత్ర పక్షమైన శివసేన మరోసారి తన అధికార పత్రిక వేదికగా మోదీ ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ వ్యవహారంలో మోదీ అనుసరించిన తీరును తప్పుబట్టింది. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మకు ఉద్వాసన పలికే ముందు కనీసం ఆయన వాదనలు వినిపించుకొనే అవకాశం కల్పించకపోవడం.. తప్పుడు సూచనలు లేవనెత్తుతోందని అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది.

‘‘ఒకవేళ రఫేల్‌ వ్యవహారంలో తనను తాను రక్షించుకొనేందుకు ప్రధాని తనకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకొని ఉంటే.. అలాంటి అవకాశాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలోక్‌ వర్మకు ఎందుకు ఇవ్వలేదు? సీబీఐ వద్ద రహస్యాలు ఉండడంతో అందుకు భయపడిన కొంత మంది, తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను ఒక్క రోజు కూడా పదవిలో ఉంచకుండా ఉద్వాసన పలికారా? ఆయన సీబీఐ చీఫ్‌గా ఉంటే రఫేల్‌ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని భయమా?’’ అని శివసేన ప్రశ్నించింది.

తొలుత బలవంతపు సెలవుపై పంపిన ఇద్దరిలో ఒకరైన రాకేశ్‌ అస్థానా మాత్రం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) మద్దతుతో సీబీఐను ప్రభుత్వానికి బానిసగా మార్చుతున్నారని శివసేన ఆరోపించింది. కేవలం కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా వర్మను సీబీఐ డైరెక్టర్‌గా తొలగించడం కుదరదని గతంలో భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్న మాటలను సంపాదకీయంలో ఉటంకించింది.

‘‘ఒకవేళ ఆలోక్‌ వర్మ నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే అతనిపై నేరుగా చర్యలెందుకు తీసుకోలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఈ పనులు చేయకుండా అగ్నిమాపక, హోంగార్డులశాఖకు డీజీగా ఎందుకు బదిలీ చేశారు? ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రఫేల్‌ వ్యవహారంలో లేవదీసిన ప్రశ్నలకు ప్రధాని వద్ద ఉన్న న్యాయవాదుల వద్ద కూడా సమాధానాలు లేవు.’’ అని సామ్నా పత్రిక సంపాదకీయంలో రాసుకొచ్చింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.