
తాజా వార్తలు
దిల్లీ: అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాణించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ మ్యాచ్‌తో అతడు మరోసారి బెస్ట్ ఫినిషర్ ట్యాగ్‌ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా త్వరలో జరగనున్న ప్రపంచ కప్‌లో వికెట్ కీపర్‌గా ధోని కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘చివరి ఓవర్ల సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయడమే సరైంది. ఆ సమయంలో ఫీల్డింగ్‌లో చిన్న చిన్న మార్పులు చేయడానికి, బౌలర్లతో మాట్లాడటానికి కుదరకపోవచ్చు. అప్పుడు జట్టులో చిన్నపాటి మార్పులకు విరాట్..ధోని మీద నమ్మకం ఉంచాడు’ అని ఓ మీడియా సంస్థతో వెల్లడించాడు. ‘జట్టుకు ధోని అవసరాన్ని వెలకట్టలేం. అతడి పాటికి అతడిని ఆడనివ్వండి. యువ క్రికెటర్లకు ఉండే నిలకడ అతడికి లేకపోవచ్చు. కొద్దిగా ఓపిగ్గా ఉండండి. కానీ అతడు జట్టుకు ఇప్పటికీ విలువైన ఆటగాడే’ అని ధోని ఆటతీరుపై సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్ వన్డే తరవాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్‌తో విరాట్ సేన వన్డే, టీ20 సిరీసుల్లో తలపడనుంది. ప్రపంచ కప్ నేపథ్యంలో తన బెస్ట్‌ను బయటకు తీయడానికి ధోనికి ఈ మ్యాచ్‌లు సరిపోతాయని గావస్కర్ వెల్లడించాడు. ఇంకా ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఉండటంతో జట్టులో కుదురుకోవడానికి మహీకి తగిన సమయం ఉందన్నాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
