close

తాజా వార్తలు

గూడూరు జంక్షన్‌లో పనులు.. కొన్ని రైళ్లు రద్దు

మరికొన్నింటికి గూడూరులో హాల్ట్‌ 
 

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ రైల్వేలోని గూడూరు జంక్షన్‌ వద్ద సాంకేతిక, ఇతర పనుల కారణంగా ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటికి అదనపు హాల్ట్‌ కల్పించినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

* బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్‌క వచ్చే నెంబరు 57240 రైలు, చెన్నై సెంట్రల్‌ నుంచి గూడూరుకు వెళ్లే 57239 నెంబరు రైలు 21 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు.

* ఎర్నాకులం నుంచి పట్నాకు వెళ్లే నెంబరు 22643 రైలు 21, 22, 28, 29; నెంబరు 12509 బెంగళూరు కంటోన్మెంట్‌ - గువాహతి కజిరంగా రైలు 22, 25; హావ్‌డా - ఎర్నాకులం అంత్యోదయ నెంబరు 22877 రైలు 26, 29; చెన్నై సెంట్రల్‌ - హజరత్‌ నిజాముద్దీన్‌ దురంతో నెంబరు 12269 రైలు 28న, చెన్నై ఎగ్మూరు - గయా 12390 రైలు 29న, చెన్నై సెంట్రల్‌ - హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ 12842 రైలు 29న, ఎర్నాకులం - హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ 22878 రైలు 29న, హావ్‌డా - యశ్వంత్‌పూరు 12245 రైలు 29న, హావ్‌డా - యశ్వంత్‌పూర్‌ 22887 రైలు 29న, తిరువనంతపురం సెంట్రల్‌ - సిల్చర్‌ ఎక్స్‌ప్రెస్‌ 12507 నెంబరు రైలు 29న, చెన్నై సెంట్రల్‌ - న్యూ జల్‌పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్‌ నెంబరు 22611 రైళ్లకు ఈ నెల 30న గూడూరులో రెండు నిమిషాల హాల్టింగ్‌ ఉంటుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.