close

తాజా వార్తలు

ఆరు వారాల తర్వాత మృతదేహం లభ్యం

కోల్‌కతా: మేఘాలయలోని బొగ్గు గనుల్లో చిక్కుకున్న 15 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికి తాజాగా వెలికి తీశారు. బుధవారం రక్షక దళం మృతదేహాన్ని తీస్తుండగా గని 26వ ముఖ ద్వారం దగ్గర జారి పడిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భారత నేవీ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఎంతో కష్టం మీద జారిన ప్రదేశం నుంచి బయటకు తెచ్చారు. మృతదేహాన్ని 355 అడుగుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. గనిలో అక్రమంగా తవ్విన సొరంగ మార్గం 210 అడుగులు దూరం. ఈ సొరంగ మార్గం గనిలో నీటి నిల్వ ఉన్న ప్రదేశం కింద దాగి ఉంది. మృతదేహాన్ని ‘‘ఈస్ట్‌ జెయింటియా హిల్స్‌’’ జిల్లా పాలనాధికారుల సమక్షంలో సాయిపంగ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించారు. శవ పరీక్ష నిమిత్తం దేహాన్ని ‘క్లీయిరైట్‌’లోని సివిల్‌ ఆసుపత్రికి తరలించారు.

అనధికారిక బొగ్గు తవ్వకాలు మేఘాలయలో పెద్ద సమస్యగా మారాయి. సన్నటి రంధ్రం చేసి సమాంతరంగా గని ఉన్న ప్రదేశానికి సొరంగం తవ్వి బొగ్గును అక్రమంగా తరలిస్తుంటారు. గత నెల 13న 20 మంది కార్మికులు మేఘాలయలోని ఈస్ట్‌ జెయింటియా జిల్లా కేశాన్‌ గ్రామంలో ఉన్న గనిలో అక్రమంగా తవ్విన సొరంగ మార్గంలో ఇరుక్కు పోయారు. అదే సమయంలో నదిలోని నీరు ప్రవాహంతో ముంచెత్తింది. కార్మికుల సమూహంలోని అయిదుగురు గనిపైకి ఎక్కగలిగారు కాని మిగతావారు చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా రక్షణ చర్యలు చాలా నెమ్మదిగా చేస్తున్నారని అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టడం ప్రారంభించినప్పటికీ నీటికి వేగంగా బయటకు పంపే సామర్థ్యమైన పంపులు లేకపోవడంతో పనులు నెమ్మదించిన విషయం విదితమే!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.