close

తాజా వార్తలు

మూడో చిత్రం బయోపిక్‌?

‘కేదార్‌నాథ్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి విజయం అందుకొంది సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌. ఆ తర్వాత రణ్‌వీర్‌సింగ్‌తో కలసి నటించిన ‘సింబా’ బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించింది. దీంతో ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. అవకాశాలు వరుస  కడుతున్నాయి. ఆమె నటించబోయే మూడో చిత్రం ఓ భారీ చిత్రమట. కరణ్‌  జోహార్‌ నిర్మించనున్నారు. ఈ చిత్రం ఓ బయోపిక్‌ అని సమాచారం. మూడో చిత్రం ఓ బయోపిక్‌ అనేసరికి సారా సంబరపడిపోతుందట. కథ బాగా  నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. మరి సారా ఎవరి బయోపిక్‌లో కనిపించనుందనే ఆసక్తి బాలీవుడ్‌ వర్గాల్లో నెలకొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.