close

తాజా వార్తలు

బొగ్గుగనిలో సహాయక చర్యలు కొనసాగించండి

కేంద్రం, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

దిల్లీ: మేఘాలయలోని అక్రమ బొగ్గుగనిలో సహాయక చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగించాలని సుప్రీం ఆదేశించింది. 2018 డిసెంబరు 13న తూర్పు జయంతియా జిల్లాలో 15మంది కార్మికులు అక్రమ బొగ్గుగనిలో తవ్వకాలు జరుపుతూ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టులో జస్టిస్‌ ఏకే సిక్రీ, ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రం, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు కొనాసాగించాలని ఆదేశిస్తూ, ఫిబ్రవరి 4న తదుపరి వాదనలు జరపనున్నట్లు పేర్కొంది. మేఘాలయలోని బొగ్గుగనిలో చిక్కుకున్న వారిలో ఇద్దరి మృతదేహాలను ఇటీవల నావికాదళం బయటకు తీసింది. మొదట జనవరి 17న ఒక మృతదేహాన్ని గుర్తించగా, జనవరి 24న 280 అడుగుల లోతులో మరో మృతదేహం కనుగొన్నారు.

ఎప్పటికప్పడు ఈ కేసు విషయమై ఆరా తీస్తున్న ధర్మాసనం సహాయక చర్యల్లో మేఘాలయ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందటూ ఇటీవల అసంతృప్తి వెలిబుచ్చింది. ఇంతటి తీవ్రమైన సమస్య ఎదురైనపుడు గనిలో చిక్కుకున్న వారిని వెలికి తీసే క్రమంలో ప్రతిక్షణం విలువైందని పేర్కొంది. ఇది జీవన్మరణ సమస్యని, అత్యవసరంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.