close

తాజా వార్తలు

ఆరోగ్యానికి... ఆరు యాప్‌లు

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు... జీవితంలో మొబైల్‌ సగ భాగమైపోయిన రోజులివీ. మాటలు, ఆటలు, పాటలు, ఖర్చుల లెక్కలు... మొబైల్‌ వీటికే కాదు... ఫిట్‌నెస్‌కు కూడా ఉపయోగపడుతుంది. మొబైల్‌లో ఓ చిన్న యాప్‌ వేసుకుంటే అది మీరు ఎంత బరువులో ఉండాలి, ఎంత కేలరీలు ఖర్చు పెట్టాలి లాంటి విషయాలు ట్రైనర్‌లాగా చెబుతుంది. అలాంటి కొన్ని యాప్స్‌ ఇవీ..

లాస్‌ ఇట్‌! (lose it)

మీరు ప్రస్తుతం 75కేజీలు ఉన్నారు.. 65కేజీలు కావడం మీ లక్ష్యం. జూన్ 29, 2019కి మీరు అనుకున్న ఫిట్‌నెస్‌ సాధిస్తారు. ఇలా ఒక యాప్‌ మీకు చెప్తే మీ పని సులభమవుతుంది కదా..! అలాంటి యాప్‌ ‘లాస్‌ ఇట్‌’. దీనికి మీరు చేయాల్సిందల్లా యాప్‌కి మీ ఎత్తు, బరువు తదితర వివరాలు ఇవ్వటమే. ఆ తర్వాత మీరు ఎన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారో ఈ యాప్‌ లెక్కగట్టి చూపిస్తుంది. ఒక రోజుకి మనం ఎన్ని కేలరీలు కరిగించాలో సూచిస్తుంది. దానికనుగునంగా మనం ఏఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చెప్తుంది.. మనం బరువు తగ్గటానికి నిరంతరం కోచ్‌లా మనకు శిక్షణనిస్తుంది.

యాప్‌ కోసం క్లిక్‌ చేయండి

కెలోరీ కౌంటర్‌ & డైట్‌ ట్రాకర్‌ (Calorie Counter & Diet Tracker)

కమ్యూనిటీ ఇంటిగ్రేషన్‌.. ఇది ఫేస్‌బుక్ లాంటి సోషల్‌ మీడియా వేదికల్లో ఎక్కువగా వింటుంటాం. ఇలాంటి ఆప్షన్‌ ఫిట్‌ నెస్‌ యాప్స్‌లోనూ ఉంది. అదే ‘స్పెర్క్‌ పీపుల్‌’ వారి కెలోరీ కౌంటర్‌ అండ్‌ డైట్‌ ట్రాకర్‌. ఇందులో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు, అభిప్రాయాలను పంచుకోవచ్చు. ప్రఖ్యాత ఫిట్‌నెస్‌ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. స్నేహితులతో మాట్లాడి సందేహాలను తీర్చుకోవచ్చు. నిపుణులు రాసిన చాలా రకాల వ్యాసాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. రోజూ మనం ఏం తిన్నం, దాని ద్వారా మనకు ఏన్ని క్యాలరీలు వచ్చాయి. అలాగే రోజూ మనం ఎంత వ్యాయామం చేశాం, దాని ద్వారా ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి.. వంటి వివరాలు దీని ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

యాప్‌ కోసం క్లిక్‌ చేయండి

మైఫిట్‌నెస్‌పాల్ ‌(MyFitnesspal)

‘నేనీ రోజు 5 కి.మీ పరుగెత్తా.. 100 కెలోరీలు ఖర్చు పెట్టా’ ఫిట్‌నెస్‌ గురించి ఎక్కువగా ఆలోచించే మీ స్నేహితులతో ఇలా మీ సమాచారాన్ని షేర్‌ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తోందా? అయితే దీని కోసం ట్విటర్‌కో, ఇన్‌స్టాకో వెళ్లనవసరంలేదు. ఇలాంటి ఫీచర్‌తో రూపొందించిందే ‘మైఫిట్‌నెస్‌పాల్’. ఇందులో ఆహార పదార్థాలు, వ్యాయామాలకు సంబంధిచిన రకరకాల వీడియోలు చూడొచ్చు. అవసరమైతే నిపుణుల సలహాలు తీసకోవచ్చు. అలాగే ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాం అనే వివరాలూ తెలుస్తాయి.

యాప్‌ కోసం క్లిక్‌ చేయండి

హెల్తీఫై మి (HealthifyMe)

‘ఉదయాన్నే టిఫిన్‌లో నాలుగు ఇడ్లీ తిన్నాను’ అని చెప్పగానే ‘మీకు 221 కెలోరీలు వచ్చాయి’ అని... ‘మధ్యాహ్నం రెండు కప్పుల పెరుగన్నం తిన్నాను’ అని ఎంటర్‌ చేయగానే ‘మీకు 176క్యాలరీలు వచ్చాయి’ అని ఓ యాప్‌ చెప్తే మీ ఫిట్‌నెస్‌ లెక్కలు సులభమవుతాయి కదా. అలాగే రోజు మనం చేసే వ్యాయామం, ఆడే ఆటలు వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి... మొత్తంగా ఈ రోజు మనకు ఎన్ని క్యాలరీలు వచ్చాయి, ఎన్ని ఖర్చయ్యాయి అని చెబితే ఇంకా సూపర్‌ కదా. ఇలాంటి వివరాలు సులభంగా చెప్పే యాప్‌ ‘హెల్తీఫై మి’.

యాప్‌ కోసం క్లిక్‌ చేయండి

వెయిట్‌ ఫిట్ ‌(WeightFit)

‘మీరు ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టినప్పుడు 89 కేజీలు ఉన్నారు. ఇప్పుడు 85 ఉన్నారు. మీ లక్ష్యం 75 కిలోలు’.. ఓ ఫిట్‌ నెస్‌ యాప్‌ ఓపెన్‌ చేయగానే మీ లక్ష్యం ఇలా కనిపిస్తుంటే మీలో స్ఫూర్తి రగులుతుంది కదా. ఇలాంటి పనే చేస్తుంది వెయిట్‌ ఫిట్‌. ఈ యాప్‌ ఓపెన్‌ చేయగానే మీ బరువు, ఎత్తు తదితర వివరాలు తీసుకుంటుంది. ఆ తర్వాత అదే మీ లక్ష్యం లెక్క గట్టి చూపిస్తుంది. మీ బీఎంఐ వివరాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఇవి చాలు కదా మీరు ఫిట్‌ అవ్వాలనే ఆలోచన నిలవడానికి.

యాప్‌ కోసం క్లిక్‌ చేయండి

గూగుల్‌ఫిట్‌ (Google Fit)

‘నువ్వు ఈ రోజు 40 నిమిషాలు నడిచావ్‌... ఇంకా 5 నిమిషాలు నడిస్తే టార్గెట్‌ రీచ్‌ అవుతావు’... ఇలా ఫిట్‌నెస్‌ యాప్‌ చెబితే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ఆప్షన్‌ ఉన్నదే గూగుల్‌ ఫిట్‌. ఇందులో మీ బరువు, ఎత్తు, మీరు నడవాలనుకుంటున్న సమయం లాంటి వివరాలు ఇస్తే యాప్‌ ఎప్పటికప్పుడు మీ అడుగుల్ని ట్రాక్‌ చేసి వివరాలు అందిస్తుంది. అలాగే మీరు వేసిన అడుగులు లెక్కగట్టి హార్ట్‌ పాయింట్స్‌ రూపంలో మీకు పాయింట్లు ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు పాయింట్ల రూపంలో ఎక్కడున్నారో ఇందులో తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... మీ స్మార్ట్‌ఫోన్‌ తీసి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేయండి.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అవ్వండి.

యాప్‌ కోసం క్లిక్‌ చేయండి


- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.