close

తాజా వార్తలు

చోరీకి చౌకీదారే స్వయంగా తలుపు తెరిచారు

మోదీపై మరోసారి ధ్వజమెత్తిన రాహుల్‌

దిల్లీ: రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైన రఫేల్‌ ఒప్పందం విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనిల్‌ అంబానీ రూ. 30వేల కోట్లు దోచుకునేందుకు చౌకీదారే స్వయంగా తలుపు తెరిచారంటూ దుయ్యబట్టారు. రఫేల్‌ ఒప్పందంపై ‘ద హిందూ’ ప్రచురించిన తాజా కథనమే ఇందుకు కారణం.

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య రఫేల్‌ ఒప్పందం జరగడానికి కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక నిబంధనలను తొలగించిందంటూ ‘ద హిందూ’ కథనం పేర్కొంది. దీనిపై స్పందించిన రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. హిందూ కథనాన్ని ట్వీట్‌ చేస్తూ.. ‘నమో (నరేంద్రమోదీ) అవినీతి వ్యతిరేక నిబంధన ఇది. వైమానిక దళం నుంచి అనిల్‌ అంబానీ రూ. 30వేల కోట్లు దోచుకునేందుకు చౌకీదారే(మోదీని ఉద్దేశిస్తూ) స్వయంగా తలుపు తెరిచారు’ అని ఆరోపించారు.

రఫేల్‌ ఒప్పందంలో ఉల్లంఘనలు స్పష్టం: చిదంబరం

ఈ కథనంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. ‘‘రఫేల్‌ ఒప్పందం అంశంలో ప్రభుత్వం ఊహించిన దానికంటే త్వరగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట 126 విమానాలను 36కు తగ్గించి డసో కంపెనీకి సాయం చేశారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం సమాంతరంగా చర్చలు జరిపింది. ఇప్పుడు అవినీతి నిరోధక నిబంధనలు ఎత్తివేసింది. ఇలా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి’’ అని ట్విటర్‌ వేదికగా అన్నారు. ఆయుధాల కొనుగోలు ఒప్పందం విషయంలో కీలక నిబంధలను భారత్‌ మార్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే డసోకు అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి కఠిన నిబంధనలు లేకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్లిందని ఆరోపించారు.

రఫేల్‌పై మరో రగడ 

రఫేల్‌ వివాదం మరో మలుపు తిరిగింది. ప్రముఖ పత్రిక ‘ది హిందూ’ దీనిపై మరో కీలక కథనాన్ని వెలవరించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఒప్పందానికి సంబంధించి ఎస్క్రో ఖాతాను నిర్వహించాలన్న ఆర్థిక నిపుణుల సలహాను పెడచెవిన పెడుతూ ప్రభుత్వం ముందుకు పోయిందని పేర్కొంది. చివరికి దీనికి బ్యాంక్‌ గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరిలో ఉందని పేర్కొంది. దాదాపు 7.87 బిలియన్‌ యూరోలు విలువైన రఫేల్‌ డీల్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిమానాలు విధించడం, ఎస్క్రో ఖాతా నుంచి చెల్లింపులు చేయడం వంటి నిబంధనలను ఒప్పందంపై సంతకాలకు కొన్ని రోజుల ముందు తొలగించారని పేర్కొంది. గతంలో కూడా ప్రధాని కార్యాలయం సమాంతరంగా చర్చలు జరపడంపై రక్షణ మంత్రిత్వశాఖ అభ్యంతరం తెలిపిన అంశాన్నిఈ పత్రిక వెల్లడించింది.

ఈ నిబంధన ఏమిటీ..

ఒప్పందాన్ని ప్రభావితం చేయాడానికి మితిమీరిన ప్రయత్నాలు... సంస్థలు లేదా వ్యక్తుల మధ్యవర్తిత్వ రుసుం( కమిషన్‌).. డసో, ఎంబీడీఏ ఖాతాలతో నేరుగా లావాదేవీలు జరపడం వంటి వాటిపై జరిమానాలు విధించడం వంటి నిబంధనలను తొలగించినట్లు ‘ద హిందూ’ కథనం పేర్కొంది. ఈ ఒప్పందంలో డసో విమానాలను సరఫరా చేయగా, ఎంబీడీఏ ఫ్రాన్స్‌ ఆయుధాలను సరఫరా చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ 24 ఆగస్టు2016లో రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందానికి ఓకే చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో రక్షణ మంత్రి పారికర్‌ నేతృత్వంలోని ‘డిఫెన్స్‌ ఎక్విజషన్‌ కౌన్సిల్‌’ ఎనిమిది మార్పులను ఆమోదించిందని పేర్కొంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.