
తాజా వార్తలు
పెళ్లి సంబంధాలు చూస్తున్నాం.. నాకు కులంతో పట్టింపులేదు
హైదరాబాద్: త్వరలోనే తన కుమార్తె నిహారిక పెళ్లి జరుగుతుందని, మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నామని సీనియర్ నటుడు నాగబాబు అన్నారు. ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్... నిహారిక గురించి ప్రశ్నించారు. దీంతో నాగబాబు ఆమె కెరీర్, పెళ్లి గురించి ముచ్చటించారు. ఆమెకు నటించడం అంటే ఇష్టమని తెలిపారు.
‘‘నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ అనుకున్నంత బాగా ఆడలేదు. తర్వాత తమిళంలో నటించింది, అది ఫర్వాలేదు. మూడో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. అదీ పెద్దగా ఆడలేదు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మధ్యలో ‘ముద్దపప్పు’ సిరీస్‌లో నటించింది. అది సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ‘సూర్యకాంతం’ అనే సినిమా చేస్తోంది. ఆడపిల్లని నటనకు పంపాలా? వద్దా? అనుకుంటున్నప్పుడు తను.. ‘నేను నటిస్తా నాన్నా. సరైన కథలు ఎంచుకుంటాను. కుటుంబంలో మొత్తం నటులు ఉన్నప్పుడు నటించాలని నాకు ఎందుకు ఉండదు’ అంది. సరే అని ఒప్పుకున్నా. తనకు నేను ముందే చెప్పా రెండు, మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తానమ్మా అని.. సరే అంది. అయితే అల్లుడు ఎవరని ఇంకా ఏమీ అనుకోలేదు. సంబంధాలు వెతుకుతున్నాం. సినీ రంగం నుంచే కావాలనే ఆంక్షలు ఏమీ లేవు. మంచి గుణాలు, పద్ధతి ఉన్న కుర్రాడైతే చాలు. కుటుంబ నేపథ్యం కూడా బాగుండాలి. నాకు కులం, మతంతో పెద్ద పట్టింపులు లేవు. 2018 వరకు అమ్మాయికి టైమ్ ఇచ్చా. 2019 వచ్చింది.. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేస్తా’ అని నాగబాబు అన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు
- భారత్‌కు ఒలింపిక్ కమిటీ షాక్
- ప్రాణం తీసిన పానీ పూరి
- మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- రూ.35 లక్షలు చెల్లించిన మహేష్‌బాబు మల్టీప్లెక్స్
- ‘భారతీయుడు’ ఆగింది ఇందుకేనట..
- రాజధాని రైళ్లకు ఇక ‘పుష్-పుల్’
- ఆమె 3.2.. అతడు 5.4 అంగుళాలు
- మహిళ కంటిలో 15 సెం.మీ. నులిపురుగు
- పశువులంటే నాకు ప్రాణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
