
తాజా వార్తలు
ముంబయి: వరుసగా మూడో సెషన్లో దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. దీనికి తోడు ఈ వారంలో వెలువడబోయే ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మదుపర్లు దృష్టిపెట్టడంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఫలితంగా సోమవారం కూడా మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
అమ్మకాల ఒత్తిడితో నేటి ట్రేడింగ్‌ను సూచీలు బలహీనంగా ప్రారంభించాయి. 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్ ఒక దశలో 220 పాయింట్లకు పైగా దిగజారింది. అటు నిఫ్టీ కూడా 70 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అయ్యింది. అయితే చివర్లో సూచీలు కాస్త కోలుకున్నప్పటికీ నష్టాలు తప్పలేదు. మొత్తం మీద నేటి సెషన్లో సెన్సెక్స్ 151 పాయింట్లు పతనమై 36,395 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,889 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.19గా కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటాస్టీల్, సిప్లా, టాటామోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్స్ షేర్లు స్వల్పంగా లాభపడగా.. రెడ్డీస్ ల్యాబ్స్, మహింద్రా అండ్ మహింద్రా, ఓఎన్జీసీ, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు
- భారత్‌కు ఒలింపిక్ కమిటీ షాక్
- ప్రాణం తీసిన పానీ పూరి
- మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- రూ.35 లక్షలు చెల్లించిన మహేష్‌బాబు మల్టీప్లెక్స్
- ‘భారతీయుడు’ ఆగింది ఇందుకేనట..
- రాజధాని రైళ్లకు ఇక ‘పుష్-పుల్’
- ఆమె 3.2.. అతడు 5.4 అంగుళాలు
- పశువులంటే నాకు ప్రాణం
- మహిళ కంటిలో 15 సెం.మీ. నులిపురుగు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
