
తాజా వార్తలు
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్
జయపుర: విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రాజస్థాన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గుజ్జర్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. గుజ్జర్లతో బహిరంగ చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ధోల్పుర్ జిల్లాలో జరిగిన అల్లర్లపై విచారణ జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్లు కోరుతూ గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రైలు పట్టాలపై భైఠాయించి ధర్నాకు దిగడంతో రైల్వే శాఖ ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారిమళ్లించింది. ధోల్పుర్, కరౌలి జిల్లాల్లో 144 సెక్షన్ అమలు అవుతోంది. రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు కిరోరీసింగ్ బైంస్లా స్పష్టంచేశారు. తమ ఆందోళనలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని ఆయన ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- ఇక ఆ హోటల్కి అస్సలు వెళ్లను: రకుల్
- వామ్మో..! రోడ్డుపై ఎంత పే..ద్ద యంత్రమో!!
- పుల్వామా దాడి: పక్కా ప్లాన్
- పాక్పై దాడి చేయండి: బలూచ్ పోరాట యోధులు
- బాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు క్లారిటీ
- దాడికి రావల్పిండి ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు
- ప్రపంచకప్:భారత్-పాక్ మ్యాచ్ జరగడానికి వీల్లేదు
- వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ
- వీర జవాను కుటుంబానికి అర ఎకరా భూమిస్తా
- ‘పెళ్లికి ముందే బిడ్డను కన్నాను’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
