close

తాజా వార్తలు

ఇంధనం లేకుండానే వాహనం నడిస్తే..

ఓ విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ

ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం వినియోగించే విద్యుత్‌ ఉచితంగా లభిస్తే.. అసలు ఇంధనం లేకుండానే వాహనం నడిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో  వాహనదారుడి మదిలో మెదిలే  అలోచనలు ఇవి. ఈ ఆలోచనలకు తగ్గట్లుగానే ఓ విద్యార్థిని తన చిట్టి బుర్రకు పదును పెట్టి ఇంధనం లేకుండానే వాహనం నడపవచ్చని.. విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని నిరూపించింది.

 పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నగిడ్ల రజని.. అందరిలా పాఠశాలకు వెళ్లామా? ఉపాధ్యాయులు చెప్పింది చదువుకున్నామా? అని కాకుండా.. ఏదో ఒకటి ఆవిష్కరించాలని భావించింది. తన ఆలోచనలను అధ్యాపకులతో పంచుకుంది. తన మేధో శక్తి, అధ్యాపకుల సహాయంతో ఇంధనం లేకుండా వాహనం నడిచేలా ఓ పరికరాన్ని తయారు చేసింది. సూర్యుడి నుంచి వెలువడే సౌర గాలులు, కాస్మిక్‌ కిరణాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఆ పరికరాన్ని తయారు చేసింది. ఈ పరికరం పేరు ‘అయాన్‌ ప్రపల్షన్‌ ఇంజిన్‌ అండ్‌ అట్మాస్పిరిక్‌ అయాన్‌ హార్వెస్టింగ్‌’.  విద్యుత్‌ తయారు చేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది.

దిల్లీలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఇన్‌స్పైర్‌- మానాక్‌ ప్రదర్శనకుఈ ప్రాజెక్టును ఎంపిక చేశారు.  భవిష్యత్‌లో డీజిల్‌,పెట్రోల్‌తో సంబంధంలేకుండా మోటార్‌లు నడిచే విధంగా ఈ పరికరం ఉపయోగపడునుంది.  జపాన్‌లో కొన్ని పరికరాల్ని భూమిలోకి పంపించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అయాన్‌ హార్వెస్టింగ్‌ పరికరాన్ని తయారు చేశామని  పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. న్యూటన్‌ గమన సూత్రాలు పనియని చోట సైతం ఈ యంత్రం పనిచేసేలా చేయవచ్చని అంటున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.