close

తాజా వార్తలు

‘చంద్రబాబు ఇవాళ హీరో అయ్యారు’

దిల్లీ: విభజన హామీలు అమలు చేయాలంటూ తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాట దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, భాజపా అసమ్మతి నేత శతృఘ్నసిన్హా దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శతృఘ్న సిన్హా మాట్లాడుతూ ఇవాళ దేశంలో చంద్రబాబు హీరో అయ్యారని కితాబిచ్చారు. కొన్ని నియమాలకు కట్టుబడే మనిషి ఆయన అని కొనియాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు గళమెత్తారన్నారు. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పవని.. ఈ విషయం ప్రధాని మోదీ తెలుసుకోవాలన్నారు. మోదీ మాటలకు చంద్రబాబు దీటుగా సమాధానమిచ్చారని ఆయన చెప్పారు. చౌకీదార్‌ ఏం చేస్తున్నారో దేశ ప్రజలు తెలుసుకున్నారని ఈ సందర్భంగా శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.

మరోవైపు రాత్రి 8 గంటలకు చంద్రబాబు దీక్ష విరమించనున్నారు. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చంద్రబాబుతో దీక్షను విరమింపజేయనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.