close

తాజా వార్తలు

ప్రపంచకప్‌కు సన్నీ చెప్పిన టీమిండియా జట్టిదే

గావస్కర్‌ జట్టులో ఎవరెవరున్నారంటే?

ముంబయి: ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల చూపంతా ప్రపంచకప్‌ జట్టువైపే. ఈ మెగా టోర్నీలో ఎవరెవరు ఆడనున్నారు? కొత్తగా జట్టులో ఎవరికైనా చోటు లభిస్తుందా? ప్రశ్నలు సగటు అభిమానికి కలుగుతుంటాయి. అయితే ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు గానూ శుక్రవారం బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టులో అభిమానుల సందేహాలకు సమాధానం దొరికే ఉంటుంది. వీటన్నింటినీ పక్కన పెడితే టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రపంచ జట్టుకు ఆడబోయే ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు. తాను చెప్పిన ఆటగాళ్ల జట్టయితే ఇంగ్లాండ్‌ గడ్డపై నెట్టుకురాగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

‘నా మైండ్‌లో 13మంది ఆటగాళ్ల పేర్లున్నాయి. వీళ్లయితే ఇంగ్లాండ్‌ గడ్డపై రాణించగలరు. కోహ్లీని వన్‌డౌన్‌ బ్యాట్సమెన్‌గా బరిలోకి దింపాలి. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ‌ధోని, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌’ వీరి సామర్థ్యాలేంటో అందరికీ తెలుసు. వీరి గత రికార్డులు కూడా బలంగానే ఉన్నాయి. ఒక వేళ ఇంగ్లాండ్‌లో స్వింగ్‌ పరిస్థితులు తలెత్తితే ఇద్దరు ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లను బరిలోకి దింపవచ్చు. ఇక విజయ్‌ శంకర్‌ను 14 ఆటగాడిగా పరిగణించవచ్చు. అయితే 15వ ఆటగాడిగా ఎవరిని ఎంపిక చేసుకుంటారనే విషయాన్ని నేను చెప్పలేను. ఖలీల్‌ అహ్మద్‌, మహమ్మద్‌ సిరాజ్‌లు ఇందుకు సరిపోరు. ఈ స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను తీసుకోవచ్చు. కాకపోతే సెలక్టర్లు ఈ ముగ్గురిపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ఇక జట్టులో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు’ అని తెలిపారు.

మరి కొన్ని రోజుల్లో ఆసీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ గురించి మాట్లాడుతూ...‘ టీమిండియా స్వదేశంలో మంచి ప్రదర్శన చేస్తుందని అనుకుంటున్నాను. ఐదు వన్డేల సిరీస్‌ను 5-0తేడాతో గెలుస్తుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.