close

తాజా వార్తలు

అడివి శేష్‌ కల..మహేశ్ నెరవేర్చబోతున్నారు

సూపర్‌స్టార్‌ నిర్మాతగా.. ‘మేజర్‌’

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మాతగా ఓ చిత్రం రాబోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్ ‌ఎస్ సంస్థలు సంయుక్తంగా‌ ఓ సినిమాను తెరకెక్కించనున్నాయి. ఈ చిత్రానికి ‘మేజర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని మహేశ్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ గెటప్‌లో అడివి శేష్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.

తెలుగు, హిందీ భాషాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శశి కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అడివి శేష్‌ నటించిన ‘గూఢచారి’ సినిమాకు కూడా శశి కిరణే దర్శకత్వం వహించారు. పలువురు టాలీవుడ్‌ ఆర్టిస్ట్‌లు ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారని అడివి శేష్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నా దగ్గర ‘మేజర్‌’ న్యూస్‌ ఉందని మీకు ముందే చెప్పా. ఈ సినిమా నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి.. ఇది మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కుతోంది. రెండు.. ఆయన 26/11 దాడులు జరిగినప్పుడు ప్రజలను కాపాడేందుకు కీలక పాత్ర పోషించారు. మూడు.. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాలుగు.. సోనీ పిక్చర్స్‌ ఇండియా సంస్థ సమర్పిస్తోంది. ఐదు.. ఈ సినిమా మమ్మల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లబోతోంది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు అడివి శేష్‌.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.