
తాజా వార్తలు
హైదరాబాద్: శర్వానంద్, సమంత కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘96’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు చిత్రబృందం ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాకు ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇటీవల ఫిలిం ఛాంబర్లో టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. సినిమాలో సమంత.. ప్రముఖ గాయని ఎస్ జానకికి వీరాభిమాని పాత్రను పోషించనున్నారట. జానకి పాడిన పాటలన్నీ సమంత సినిమాలో పాడుతూ ఉంటారట. అందుకే ఈ చిత్రానికి ‘జానకి దేవి’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘96’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్.. తెలుగు వెర్షన్‌ను కూడా తెరకెక్కించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. గోవింద్ వసంత సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
