close

తాజా వార్తలు

ఇంటింటా విమానమంట!

అనగనగా ఓ ఊరుంది... దానికి విమానాల ఊరిగా పేరుంది...ఎందుకో ఏమిటో? చదివేద్దాం రండి.
ఇప్పుడు మనం చాలా ఇళ్ల ముందు కారు పార్క్‌ చేసి ఉండటం చూస్తున్నాం. కారు గ్యారేజీలు కట్టుకోవడమూ చూస్తూనే ఉన్నాం. మోటార్‌సైకిళ్లయితే ఏ ఇంటిముందైనా కనిపిస్తున్నాయి. మరేమో ఓ ఊరిలో అయితే ప్రతి ఇంటికీ ఓ విమానం ఉంటుంది.
* అదేం ఊరో తెలుసా? అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఉంది కదా. అక్కడ స్ప్రూస్‌ క్రీక్‌ అనే చిన్న పల్లె.
* పల్లెటూరంటే ఆషామాషీ కాదు. గేటెడ్‌ కమ్యూనిటీలా ఇది ప్రైవేట్‌ గేటెడ్‌ విలేజ్‌ మరి.

* అంటే కొంత మంది కలిసి విడిగా ఈ ఊరిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికీ కారు గ్యారేజ్‌ ఒక్కటే కాదు. హేంగర్‌ కూడా ఉంటుంది. హెలికాఫ్టర్‌ పెట్టుకునే గ్యారేజీనే హేంగర్‌ అంటార్లేండి.
* ఇక్కడ మొత్తం 5వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. 13వందల ఇళ్లుంటే వాటిలో ఏడు వందల ఇళ్లకు హేంగర్‌లున్నాయి.
* ఇక్కడి వారిలో చాలామంది సర్టిఫైడ్‌ పైలెట్లే. అందుకే ఎవరి హెలికాఫ్టర్లో వారు ఎంచక్కా షికారు కొట్టేస్తుంటారు.

* ఇక్కడో ప్రైవేటు ఎయిర్‌పోర్ట్‌ కూడా ఉంది. దాంట్లో కొందరు వారి హెలికాఫ్టర్లను పార్క్‌ చేసుకుంటుంటారు. ఇంకా ఇళ్ల ముందుండే రోడ్లనే రన్‌వేలుగా ఉపయోగపడేలా వేసుకున్నారు.
* పేరొందిన సెస్నాస్‌ అండ్‌ పైపర్స్‌, ఎక్లిప్స్‌ 500, మిగ్‌-15ఫైటర్‌ జెట్‌...లాంటి ఎన్నో రకాల హెలికాఫ్టర్లు ఈ ఊర్లో ఉన్నాయి.

* ఇక్కడుండే వారిలో చాలామంది వృత్తిరీత్యా పైలెట్లే. కొందరు డాక్టర్లు, లాయర్లు... లాంటివారూ ఉన్నారు.
* ప్రతి శని, ఆదివారాల్లో ఈ ఊర్లో ఉండే ఫ్రెండ్స్‌ అంతా ఒక్క చోట చేరతారు. దగ్గర్లోని ఏ ఎయిర్‌పోర్ట్‌కి వెళదామో చర్చించుకుంటారు. తమ విమానాల్లో ఎక్కేసి టిఫిన్‌ తినేందుకు అక్కడికి బయలుదేరేస్తారు.
* రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వీరు ఇలా జీవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీరి దగ్గర ఖరీదైన హెలికాఫ్టర్లతో పాటు అత్యంత విలాసవంతమైన కార్లూ ఉన్నాయి.

* అసలు విషయం ఏంటంటే విమానాలు నడిపేవారంతా కలిసి ఇలా ఫ్లయింగ్‌ కమ్యూనిటీలుగా ఏర్పడుతుంటారు. అమెరికాలో ఇలాంటి ఫ్లయింగ్‌ కమ్యూనిటీలు 600కుపైగా ఉన్నాయి. ఆరిజోనా, ఫ్లోరిడా, టెక్సస్‌, కొలరెడో, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో ఇవెక్కువ. అయితే వీటన్నింటిలో ఈ స్ప్రూస్‌ క్రీక్‌ అతి పెద్ద ఫ్లయింగ్‌ కమ్యూనిటీ. మొత్తానికి భలే ఊరే కదూ!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.