
తాజా వార్తలు
ఫిట్ మంత్ర
పూర్తిగా పొట్ట మాడ్చుకుని, అదేపనిగా వ్యాయామం చేస్తే సన్నబడతారనేది చాలామంది అభిప్రాయం. దానివల్ల బరువు తగ్గుతారు కానీ... అది ఆరోగ్యకరం కాదు సరికదా సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఓ పద్ధతి ప్రకారం బరువు తగ్గేలా చూసుకోవాలి. అదెలాగో తెలుసుకుందామా...
ఈ కాలంలో చిన్న వయసు అమ్మాయిలకే థైరాయిడ్, పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) వస్తున్నాయి. ప్రధానంగా శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడమే అందుకు కారణం. వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి సమస్యలు దూరం కావడమే కాదు... ఆరోగ్యకరమైన జీవనశైలీ అలవడుతుంది. బరువూ అదుపులోకి వస్తుంది. అయితే అదీ ఓ పద్ధతి ప్రకారమే తగ్గాలి.
* సాధారణంగా నెలకు రెండు నుంచి మూడు కేజీల వరకూ బరువు తగ్గొచ్చు. అంతకు మించి తగ్గడం సరికాదు. కొందరు ఏవేవో డైట్లు పాటిస్తారు. ప్రొటీన్పౌడర్లు తీసుకుంటారు. ఇతర పద్ధతులను ఎంచుకుంటారు. కానీ అలా తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖంలో జీవం పోతుంది. మెడ, చెంపల దగ్గర చర్మం సాగినట్టు కనిపిస్తుంది. జుట్టు ఊడిపోతుంది. నీరసం బాధిస్తుంది.
* ముప్ఫై ఐదేళ్ల లోపు వారికి జీవక్రియలు బాగుంటాయి. ఆ వయసులోపు వారు క్రమపద్ధతిలో వర్కవుట్లు చేస్తే బరువు తగ్గడం సులువు. అదే 35 దాటిన మహిళలు అయితే చాలా కష్టపడాలి. ఒళ్లంతా చెమటలు పట్టాలి. చర్మగ్రంథులన్నీ తెరచుకుని... శరీరంలోని వ్యర్థాలు బయటకు రావాలి. అప్పుడే తగ్గడం సాధ్యమవుతుంది.
* మహిళలకు రకరకాల వ్యాపకాల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి పెరిగి.. బరువుకు కారణమవుతుంది. దాంతో ఇంకా లావైపోతారు. కాబట్టి ఒత్తిళ్లని అధిగమిస్తూ... పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. తగినంత విశ్రాంతి కూడా అవసరం. ముఖ్యంగా మెనోపాజ్ దశకు చేరకముందే ఎముక సాంద్రత పెంచుకోవాలి.
ఎలాంటి వ్యాయామాలు
* చాలామంది పొట్ట దగ్గర కొవ్వు తగ్గితే చాలు అనుకుంటారు. అందుకు సంబంధించిన వ్యాయామాలే చేయాలనుకుంటారు. కానీ అది సరికాదు. శరీరం మొత్తానికి కదలిక ఉండాలి. అన్ని భాగాల్లోనూ కొవ్వు పోవాలి. ఆ విధంగా ప్రణాళిక వేసుకుని వ్యాయామాలు చేయాలి.
* బరువు తగ్గాలనుకునేవారికి కార్డియో వ్యాయామాలు మంచివి. అందులో భాగంగా ఏరోబిక్స్, పరుగు, తాడాట వల్ల చాలా త్వరగా ఫలితం ఉంటుంది. దాదాపు నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకూ చేయాలి. అయితే చాలామంది లేచిన వెంటనే వ్యాయామాలు మొదలుపెడుతుంటారు. ఎప్పుడైనా సరే ముందుగా వార్మ్అప్ ముఖ్యం. అది లేకుండా నేరుగా వ్యాయామాలు చేస్తే ఇబ్బందే.
* జుంబా వల్ల కూడా త్వరగా సన్నబడటం సాధ్యమవుతుంది. అయితే అది చేయడం కంటే... చేసే చోట ఫ్లోర్ ముఖ్యం. గట్టిగా ఉన్న నేలమీద చేయకూడదు. కుషన్లాంటి ఫ్లోర్ మీద చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకే నిపుణుల అధ్వర్యంలో చేయమని సూచిస్తాం.
* వ్యాయామాలు ఎప్పుడూ ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న చోట చేయాలి. ఆ సమయంలో శరీర అవయవాలకు ఆక్సిజన్ చేరడం వల్ల... త్వరగా ఫలితం ఉంటుంది.
* బరువు తగ్గాలనుకునేవారికి విటమిన్ డి లోపం ఉండకూడదు. ఎండలో సాధ్యమైనంత సమయం ఉండాలి. పాలు, సోయా ఉత్పత్తులు తీసుకోవాలి. అప్పుడే వ్యాయామం చేసిన ఫలితం అందుతుంది. బరువు తగ్గడం కూడా సాధ్యమవుతుంది.
* అన్నింటితోపాటు సానుకూల ధోరణి ఉండాలి. నేను బరువు తగ్గి తీరతాను అనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. సాధ్యమైనంత సంతోషంగా ఉండాలి. ఏ వ్యాయామం చేసినా శ్వాసమీద ధ్యాస ఉండాలి.
ఎలా తినాలి * ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాం... ఇక తిన్నది చాలు అనుకుంటే సరికాదు. మధ్య మధ్యలో నట్స్, ఎండుఫలాలు, పండ్ల ముక్కలు, రసాల వంటివి ఏవో ఒకటి తీసుకోవాలి. ఎక్కువ సమయం పొట్ట ఖాళీగా ఉండటం కూడా సరికాదు. * నీళ్లు ఎక్కువగా తాగాలి. ఈ వేసవిలో ఆ శాతం ఇంకా పెంచాలి. నీళ్లతోపాటు కొబ్బరినీళ్లు, చెరకు రసం, పుదీనా, జల్జీరా, నిమ్మరసం.. ఇలా రకరకాల పానీయాలకూ ప్రాధాన్యమివ్వొచ్చు. డీహైడ్రేషన్ కూడా ఉండదు. * పీచు... బరువు తగ్గాలనుకునేవారికి బాగా మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయలు, ఓట్స్, తృణధాన్యాలతో చేసిన బ్రెడ్, బ్రౌన్ రైస్, బీన్స్, పచ్చిబఠాణీల వంటివి మంచిది. చక్కెర, చాక్లెట్లు, బిస్కెట్లు, మిఠాయిలు, శీతలపానీయాలు, వేపుళ్లు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. జాక్వెలిన్ బబిత జ్సెవియర్ ఫిట్నెస్ నిపుణురాలు.
|
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పసిపాప రియాక్షన్కు నెటిజన్లు ఫిదా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
