close

తాజా వార్తలు

యూకే పత్రాలు అడిగినా..భారత్‌ స్పందించలేదు!

నీరవ్ మోదీ అప్పగింతపై ఆంగ్ల మీడియా కథనం

దిల్లీ: లండన్‌ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ, లక్షల విలువైన దుస్తులు ధరించి వజ్రాల వ్యాపారం కూడా చేస్తోన్న పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ గురించి బ్రిటిష్ మీడియా రెండు రోజుల క్రితం ఓ వీడియోను వెలువరించింది. దానిపై విపక్షాలు గగ్గోలు పెట్టాయి.  భారత్‌కు తీసుకొచ్చే విషయంలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం సమాధానం చెప్పింది. అయితే ఆ ప్రయత్నాల్లో పూర్తి స్థాయి వాస్తవం లేదని ఓ ఆంగ్ల మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. అతడి అప్పగింతకు సంబంధించి సమాచారం కోసం బ్రిటిష్‌ అధికారులు ఎన్నోసార్లు భారత్ ప్రభుత్వం సమాధానం కోరినా మనవైపు నుంచి స్పందన లేదని ఆ కథనం వివరించింది. ఆ కేసులో సహకరించడానికి యూకే బృందం భారత్‌కు వస్తానని చెప్పినా, భారత్ వైపు నుంచి మాత్రం స్పందనలేదని పేర్కొంది. పీఎన్‌బీ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసి, నీరవ్ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.