close

తాజా వార్తలు

ప్రధాని, కేంద్ర మంత్రుల చిత్రాల తొలగింపు..

న్యూదిల్లీ: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) వెబ్‌సైట్‌తో పాటు పలు ప్రభుత్వ సైట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రుల చిత్రాలను తొలగించారు. కొన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వెబ్‌సైట్లలో మాత్రం కొందరు కేంద్ర మంత్రుల చిత్రాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటన చేసిన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇది అమలులో ఉంటుంది. 

నియామవళి ప్రకారం... కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తమ కార్యాలయాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోకూడదు. ఏ విషయాలకూ నిధులు విడుదల చేయకూడదు.. పథకాలను ప్రారంభించొద్దు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఉండే ఎటువంటి చర్యలకు పాల్పడవద్దు. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శితో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ ఓ లేఖ పంపింది. ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉండే చిత్రాలను తొలగించాలని లేదా కనపడకుండా చేయాలని ఆదేశించింది. పీఎంవో వెబ్‌సైట్‌తో పాటు పలు సైట్లలో మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల చిత్రాలు కనపడట్లేదు. అయితే, ఇప్పటివరకు మాత్రం న్యాయశాఖ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చిత్రాలు ఉన్నాయి. అలాగే, మైనార్టీ వ్యవహారాల శాఖ వెబ్‌లో ఆ శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చిత్రాలు ఉన్నాయి. మరోవైపు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మున్సిపల్‌ భవనాలు వంటి ప్రాంతాల్లో అనధికార రాజకీయ ప్రకటనలతో ఉన్న పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు, పార్టీ జెండాలను ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మూడు రోజుల్లోగా తొలగించాలని ఆదేశాలు ఉన్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.