close

తాజా వార్తలు

వివేకా హత్య ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు: బుద్ధా

అమరావతి: జగన్‌, మోదీ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారని వివేకా హత్య ఘటనతో తేలిపోయిందని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న విమర్శించారు. మొన్నటివరకూ సీబీఐ తనపై దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన జగన్‌.. ఇప్పుడు హత్య ఘటనపై ఆ సంస్థతో విచారణకు డిమాండ్‌ చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. శనివారం అమరావతిలో బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘హత్య ఘటనపై జగన్‌ కంగారు పడిపోతున్నారు. ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు పూర్తయితే సాయంత్రానికి కడప నుంచి వచ్చి సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయడం ఏంటి? అజాత శత్రువు అయిన వివేకా హత్య ఘటనను మేం సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తాం. దోషులను పట్టుకొని తీరతాం. ఇందుకు సహకరించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన భద్రత మా ప్రభుత్వంపైనే ఉంది. అసలు జమ్మలమడుగులో వివేకా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? కడప, జమ్మలమడుగు, పులివెందులలో ఎక్కడైనా వివేకానంద రెడ్డికి సీటిచ్చారా? రాష్ట్ర పోలీసులకు సహకరిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ బయటపెడతారు’’ అని ధ్వజమెత్తారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.