close

తాజా వార్తలు

కాజల్‌ ఉన్నా.. పాయల్‌ మీదే ఫోకస్‌

దర్శకుడు తేజ

హైదరాబాద్‌: ‘ఆర్‌ ఎక్స్‌ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌పై ప్రముఖ దర్శకుడు తేజ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న నటి పాయల్‌. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం పాయల్‌ చేతిలో రెండు మూడు చిత్రాలున్నాయి. తేజ దర్శకత్వం వహిస్తున్న ‘సీత’ చిత్రంలో పాయల్‌ ప్రత్యేక గీతంలో నర్తించనున్నారు. ఈ సందర్భంగా పాయల్‌ గురించి తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో టాలెంట్‌ ఉన్న నటీమణుల్లో పాయల్‌ ఒకరు. ఆమె అందంతో ఈ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం. ఈ పాట కోసం ఆమె కొరియోగ్రాఫర్‌ చెప్పినట్లుగా చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడు రిహార్సల్స్‌కి రమ్మన్నా వస్తున్నారు. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఈ పాటలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ ఉన్నప్పటికీ ఫోకస్‌ అంతా పాయల్‌పైనే ఉంటుంది. ఆమె వేసే స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 2019లో బెస్ట్‌ సాంగ్‌ ఆఫ్ ది ఇయర్‌గా ఈ పాట నిలిచిపోతుందని గట్టిగా చెప్పగలను. సినిమాలో ఈ పాటే కీలకం. అదీకాకుండా నా సినిమాల్లో ప్రత్యేక గీతాలు ఉండడం చాలా అరుదు. పాట హిట్టవుతుందన్న నమ్మకం ఉంది’ అని వెల్లడించారు తేజ. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.