close

తాజా వార్తలు

పూరీ రైల్వే స్టేషనులో అగ్ని ప్రమాదం

పూరీ: ఒడిశాలోని పూరీ రైల్వే స్టేషనులో ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్టేషనులోని నాలుగో ప్లాట్‌ఫాంలో ఆగి ఉన్న తపస్విని ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమై, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.  వెంటనే ప్రమాదానికి గురైన బోగీల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా దించివేశారు. ఈ ప్రమాదంలో రైలులోని ఎస్‌-3, ఎస్‌-4, ఎస్‌-5 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.