Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 73741
            [news_title_telugu_html] => 

మిషన్‌ శక్తి 2012లోనే ప్రారంభమయింది..

[news_title_telugu] => మిషన్‌ శక్తి 2012లోనే ప్రారంభమయింది.. [news_title_english] => Congratulations to DRDO and govt of India [news_short_description] => యాంటీ శాంటిలైట్‌ (ఏ-శాట్‌) క్షిపణిని భారత్‌ విజయవంతగా ప్రయోగించిందని, ఇది తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఒక శాటిలైట్‌ను కేవలం 3 నిమిషాల్లోనే కూల్చేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. [news_tags_keywords] => DRDO,India,MissionShakti,UPA,modi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-27 22:26:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మిషన్‌ శక్తి 2012లోనే ప్రారంభమయింది.. - Congratulations to DRDO and govt of India - EENADU
close

తాజా వార్తలు

మిషన్‌ శక్తి 2012లోనే ప్రారంభమయింది..

న్యూదిల్లీ: యాంటీ శాంటిలైట్‌ (ఏ-శాట్‌) క్షిపణిని భారత్‌ విజయవంతగా ప్రయోగించిందని, ఇది తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఒక శాటిలైట్‌ను కేవలం 3 నిమిషాల్లోనే కూల్చేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ప్రకటనపై పలు పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇది తన గొప్పతనంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

* మిషన్‌శక్తిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ.. అద్భుత విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. కాంగ్రెస్‌ పాలనలోనే స్థాపించినట్టు చెప్పే ప్రయత్నం చేసింది. ‘ఈ నూతన విజయం సాధించినందుకుగానూ ఇస్రోతో పాటు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాము. భారత అంతరిక్ష కార్యక్రమాలను 1961లో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇందిరా గాంధీ హయాంలో ప్రారంభమైంది. ఆ సంస్థ ఎల్లప్పుడూ అద్భుత విజయాలు సాధిస్తూ భారత్‌ గర్వపడేలా చేస్తోంది’ అని తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.

* కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ... ‘డీఆర్‌డీవో అద్భుత పనితీరు పట్ల గర్వపడుతున్నాం’ అని ట్వీట్‌ చేశారు. అలాగే, ప్రపంచ ‘థియేటర్‌ దినోత్సవం’ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ చురకలంటించారు.   

* బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ... ‘యాంటీ శాంటిలైట్‌ క్షిపణిపై కూడా ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.  

* ‘మిషన్‌శక్తి’ విజయవంతం కావడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ... ‘దేశంలోని నిరుద్యోగ సమస్య, గ్రామీణ ప్రాంతాల సమస్యలు, మహిళా భద్రత సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాస్త సమయాన్ని తీసుకుని, ఆకాశాన్ని చూపుతూ మభ్యపెట్టేప్రయత్నం చేశారు’ అని విమర్శించారు. అలాగే, ఈ విజయం డీఆర్‌డీవో, ఇస్రోలకు చెందుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను సురక్షితమైన దేశంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

* కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా స్పందిస్తూ... ‘డీఆర్‌డీవోకి అభినందనలు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012లో ఈ ప్రయోగ పరిశోధన ప్రారంభమైంది. మాజీ ప్రధాని నెహ్రూ, శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయి విజన్‌ వల్లే అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ అద్భుతంగా రాణిస్తోంది’ అని పేర్కొన్నారు. ‌

* గుజరాత్‌ యువనేత జిగ్నేశ్‌ మేవానీ ఇదే విషయంపై స్పందిస్తూ... ‘మోదీజీ మీరు ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు? 2012లోనే మిషన్‌ శక్తి కోసం పరిశోధన మొదలైంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా అప్పట్లో మీడియాలో వచ్చిన కథనాలను పలువురు నేతలు ట్వీట్ చేశారు.

భాజపా నేతల ప్రశంసల జల్లు..

* ‘మిషన్‌శక్తి’ విజయవంతం కావడం పట్ల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ... ‘ఇది చరిత్రాత్మక రోజు. భారత్‌ గొప్ప అంతరిక్ష శక్తిగా అవతరించింది. ఇందుకు గానూ శాస్త్రవేత్తలందరినీ, మన ప్రధానమంత్రిని అభినందించాలి. వారికి నా శుభాకాంక్షలు’ అని వ్యాఖ్యానించారు.

* భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఈ విషయంపై స్పందిస్తూ... ‘మిషన్‌ శక్తి విజయవంతం కావడంలో కృషి చేసి శాస్త్రవేత్తలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. దేశ ప్రజల ప్రయోజనాల కోసం భారత్‌ను సురక్షితమైన దేశంగా చేస్తున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

* మిషన్‌ శక్తిపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్‌ స.. ‘మిషన్‌ శక్తి విజయవంతం కావడం గర్వించతగ్గ, చరిత్రాత్మక విషయం. మోదీ నాయకత్వంలో మనం శాటిలైట్‌ను కూల్చేసే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాం’ అని పేర్కొన్నారు. 

* ఈ విజయంపై మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ... దేశంలోని సమర్థవంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డీఆర్‌డీవో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. యాంటీ శాంటిలైట్‌ (ఏ-శాట్‌) క్షిపణితో తక్కువ ఎత్తులోని కక్ష్యలోని శాటిలైట్‌ను కూల్చేసే సామర్థ్యం గల నాలుగో దేశంగా భారత్ నిలిచినందుకు గర్వపడుతున్నాను. డీఆర్‌డీవో, ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.