close

తాజా వార్తలు

యువీ మెరుపులు: బెంగళూరు లక్ష్యం 188

బెంగళూరు: చిన్నస్వామిలో ముంబయి ఇండియన్స్‌ రెచ్చిపోయింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు 188 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. హార్దిక్‌ పాండ్య (32 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 3×6), యువరాజ్‌ సింగ్‌ (23; 12 బంతుల్లో 3×6) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకు ముందు రోహిత్‌ శర్మ (48; 33 బంతుల్లో 8×4, 1×6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. సూర్య కుమార్‌ (38), డికాక్‌ (23) రాణించారు. ముంబయి 142 నుంచి 147 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. కష్టాల్లో పడ్డ ఆ జట్టును పాండ్య ఆదుకున్నాడు. యుజువేంద్ర చాహల్‌ 4 వికెట్లు తీశాడు. ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.