close

తాజా వార్తలు

హెలికాప్టర్‌కు అనుమతి రద్దు చేసిందెవరు?: పవన్‌

కడప: వైకాపా అధ్యక్షుడు జగన్‌పై కడప వేదికగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను యాక్టర్‌, తెదేపా పార్టనర్‌ అనడం సబబు కాదన్నారు. తానేదో ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదని, ఎంతో అధ్యయనం చేసి వచ్చానన్నారు. జగన్‌.. భాజపా, తెరాస పార్టనర్‌ అని మండిపడ్డారు. తనను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వచ్చిన తనను యాక్టర్‌ అంటున్నారని, మరి జైలులో ఉండి వచ్చిన జగన్‌ను ఏమనాలని ప్రశ్నించారు. రాయలసీమకు బంగారు రోజులు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకొస్తానన్నారు. తాను ఎవరితో మాట్లాడినా వారికి పార్టనర్‌ అంటున్నారు. తెరాస నేతలతో గౌరవప్రదంగా మాట్లాడితే ఆ పార్టీకి పార్టనర్‌ అని, జగన్‌తో కలిసి పోటీచేస్తానంటూ చాలా కాలం ప్రచారం జరిగిందని చెప్పారు. ఇప్పుడు జగన్‌ తనను తెదేపా పార్టనర్‌ అంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు సభకు హెలికాప్టర్‌లో రావాలనుకుంటే.. హెలికాప్టర్‌ పర్మిషన్‌ను రద్దుచేశారని, ఎక్కడి నుంచి డైరక్షన్‌ వచ్చిందో తెలియడంలేదన్నారు. జగన్‌ ఇచ్చారా? లేకపోతే భాజపా నేతలు ఇచ్చారో అర్థంకావడంలేదని పవన్‌ వ్యాఖ్యానించారు.  జగన్‌లా తాను డొంకతిరుగుడు రాజకీయాలు చేయబోనని, రాయలసీమ పద్ధతిలో ముఖస్తుతి లేకుండా మాట్లాడగలని చెప్పారు. 

కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వస్తే కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక నేతలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని, అందుకే చాలా మంది పరిశ్రమలు పెట్టలేకపోతున్నారని విమర్శించారు.  ఫలితంగా ఇక్కడి యువత వలసలు వెళ్తున్నారన్నారు.  రాష్ట్రంలో 25వేల మంది స్పెషల్‌ పోలీస్‌ కమెండోలను నియమించనున్నట్టు చెప్పారు. 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు రూ.5వేలు పింఛను ఇస్తానని స్పష్టంచేశారు. సాగు సాయం కింద రూ.8వేలు ఇస్తామని చెప్పారు. బయటివాళ్లు వచ్చి రాయలసీమలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పిస్తామని చెప్పారు. రాయలసీమకు వ్యవసాయ మండళ్లు తీసుకొస్తామని, తద్వారా రాష్ట్రంలో లక్ష మంది యువ రైతులను తయారు చేస్తామని అన్నారు. రాయలసీమలో రూ.5 వేల కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఎకరానికి రూ. కుటుంబానికి 6-10 గ్యాస్‌ సిలిండర్‌లు ఉచితంగా ఇవ్వనున్నట్టు పవన్‌ హామీ ఇచ్చారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.