close

తాజా వార్తలు

ముంబయిని ఓడించిన పంజాబ్‌

మొహాలి: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రెండో విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఘోరంగా ఓడించింది. మందకొడి పిచ్‌పై 177 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టపోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (71; 57 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు. కడవరకు నిలిచి ‘కింగ్స్‌’ను గెలుపుబాట పట్టించాడు. క్రిస్‌గేల్‌ (40; 24 బంతుల్లో 3×4, 4×6), మయాంక్‌ అగర్వాల్‌ (43; 21 బంతుల్లో 4×4, 2×6) మెరుపులు మెరిపించారు. అంతకు ముందు ముంబయిలో డికాక్‌ (60), రోహిత్‌ శర్మ (32), హార్దిక్‌ పాండ్య (31) రాణించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.