Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 77452
            [news_title_telugu_html] => 

నెల క్రితమే భారత్‌ రహస్య ప్రయోగం..!

[news_title_telugu] => నెల క్రితమే భారత్‌ రహస్య ప్రయోగం..! [news_title_english] => Did India hush up a failed anti-satellite missile test [news_short_description] => భారత్‌ కొన్నేళ్ల క్రితమే యాంటీశాటిలైట్‌ టెక్నాలజీని సంపాదించిందని ఇటీవల మాజీ డీఆర్‌డీవో చీఫ్‌ ఒకరు పేర్కొన్నారు. కానీ ఇప్పట్లో అంతర్జాతీయ పరిస్థితుల... [news_tags_keywords] => asat,drdo,us [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-03 11:00:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నెల క్రితమే భారత్‌ రహస్య ప్రయోగం..! - Did India hush up a failed anti-satellite missile test - EENADU
close

తాజా వార్తలు

నెల క్రితమే భారత్‌ రహస్య ప్రయోగం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ కొన్నేళ్ల క్రితమే యాంటీశాటిలైట్‌ టెక్నాలజీని సంపాదించిందని ఇటీవల మాజీ డీఆర్‌డీవో చీఫ్‌ ఒకరు పేర్కొన్నారు. కానీ అప్పట్లో అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా భారత్‌ దానిని పరీక్షించలేదు. కానీ ఇటీవల మార్చి 27న విజయవంతంగా పరీక్షించింది. కానీ ఇది తొలిప్రయత్నంలో సాధించిన విజయం కాదంటున్నాయి నివేదికలు.. ఫిబ్రవరిలో భారత్‌ రహస్యంగా ఒక సారి యత్నించింది..ఆ ఫలితాలను అంచనా వేసి మార్చిలో రెండో యత్నం చేసి విజయం సాధించిందని ప్రముఖ ఆంగ్ల పత్రిక డిప్లమాట్‌ తన కథనంలో పేర్కొంది. 
అమెరికా కన్ను ఉంది..
ఫిబ్రవరిలో ప్రయోగం నిర్వహించిన విషయం పెద్దన్న అమెరికాకు ముందే తెలుసు. అమెరికా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ భారత్‌ కార్యకలాపాలపై కన్నేసింది. భారత్‌ కొత్త తరహా  టెక్నాలజీ అయిన డైరెక్ట్‌ -అసెంట్‌ కైనటెక్‌ ఇటర్‌సెప్టర్‌ విధానాన్ని వాడినట్లు తన నివేదికలో పేర్కొంది. 
తొలుత భారత్‌ ఫిబ్రవరి 10-12 వరకు తూర్పు తీర గగనతలంపై ఆంక్షలు విధిస్తూ నోటామ్‌ జారీ చేసింది. ఇది అమెరికాకు కూడా అదింది. తాజాగా ఇదే ప్రదేశంలో మార్చి 27కు ముందు కూడా మరో నోటామ్‌ జారీ చేసింది. అంటే గతంలో కూడా అటువంటి ప్రయోగం చేసిందనే అమెరికా భావించింది. గతంలో చేసిన ప్రయోగం కేవలం 30 క్షణాల పాటే సాగిందని అమెరికా అధికారులు అంటున్నారు. క్షిపణి అబ్దుల్‌ కలామ్‌ దీవి నుంచి లాంచ్‌ప్యాడ్‌ మీద నుంచి టేకాఫ్‌ కావడం, నిర్దేశించిన మార్గంలో వెళుతోందో లేదో పరీక్షించడానికే దీనిని నిర్వహించి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. దీనిలో అసలైన లక్ష్యానికి బదులు ఎలక్ట్రానిక్‌ టార్గెట్‌ను ఎంచుకొనే అవకాశం ఉంది. అనంతరం భారత్‌ యాంటీ శాటిలైట్‌ పరీక్షను నిర్వహించింది. భూమిపై నుంచి 186 మైళ్ల ఎత్తున ఉన్న మైక్రోశాట్‌-ఆర్‌ను తన లక్ష్యంగా ఎంచుకొని విజయం సాధించింది. 
నోటామ్‌ అంటే ఏమిటీ..?
నోటామ్‌ అంటే నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌ అని అర్థం. ఇది నిర్దేశిత మార్గంలో ప్రయాణించే విమాన పైలట్లను అప్రమత్తం  చేస్తూ వైమానిక శాఖ జారీ చేస్తుంది.

ఎయిర్‌షోలు జరిగేటప్పుడు, ప్యారాచూట్లపై నుంచి దూకే సమయంలో, గాలిపటాల ఉత్సవాలు జరిగేటప్పుడు, లేజర్‌ రాకెట్లను ప్రయోగించేటప్పుడు జారీ చేస్తారు. 
అత్యంత ప్రముఖులు, దేశాధ్యక్షులు ప్రయాణించే మార్గాల్లో నోటామ్‌ జారీ చేస్తారు.
మిలటరీ విన్యాసాలు జరుగుతున్నపుడు, భారీ సంఖ్యలో పక్షుల గుంపులు వలస వస్తున్నపుడు ఇతర కారణాలతో దీనిని జారీ చేస్తారు.   
శకలాలపై ఆందోళన..
భారత్‌ వారం క్రితం ఉపగ్రహ విధ్వంసక ప్రయోగం(ఏశాట్‌) జరిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ సత్తా కలిగిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. అయితే దీని వల్ల అంతరిక్షంలో 400 శకలాలు ఏర్పడ్డాయని.. వీటితో ఐఎస్ఎస్‌కు ముప్పు పొంచి ఉందని నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.