close

తాజా వార్తలు

​​​​​కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు: మాయావతి

లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్‌): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. ‘మోసపూరిత హామీలతో ప్రజలను ఆకర్షించడానికే కాంగ్రెస్ పార్టీ ఈ‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ చాలా కాలంగా ఇటువంటి అసత్య హామీలను ఇస్తూనే ఉంది. దీంతో ప్రజల్లో ఆ పార్టీ విశ్వసనీయత, నమ్మకాన్ని కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌కి మధ్య తేడా ఏమీ లేదు’ అని ఆమె విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాము కూటమి ఏర్పాటు చేయడంతో భాజపా నేతలు భయపడుతున్నారని ఆమె మరో ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు.

‘రాష్ట్రంలో బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి ఏర్పాటు చేయడంతో భాజపా నేతలు భయపడుతున్నారు. నిజమైన సమస్యల గురించి మాట్లాడకుండా మా కూటమిపై రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విధమైన తీరుతో వారు ఎన్నికల్లో విజయం సాధించలేరు’ అని మాయావతి ట్వీట్‌ చేశారు. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు వ్యతిరేకంగా బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 38, ఎస్పీ 37, ఆర్‌ఎల్‌డీ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగతా రెండు సీట్లను కాంగ్రెస్‌ కోసం వదిలేస్తున్నట్లు ఆ కూటమి ప్రకటించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.