close

తాజా వార్తలు

ముంబయి 100.. మిగిలినవి..?

ముంబయి : మూడు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌.. రెండు సార్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత.. మరోసారి ఐపీఎల్‌ ఫైనలిస్టు.. ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో రికార్డులు ముంబయి ఇండియన్స్‌ సొంతం.. ఐపీఎల్‌ చరిత్రలో మరే జట్టు సాధించలేని రికార్డులు ముంబయి సాధించింది. 2013లో తొలిసారిగా ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. తర్వాత 2015, 2017లో టైటిల్‌ గెలుచుకుంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మట్టికరిపిస్తూ.. కొరకరాని కొయ్యలా తయారైందీ జట్టు. ఐపీఎల్‌లో ప్రతిసారీ ఫెవరేట్‌గా దిగే ముంబయి ఇండియన్స్‌ ఈసారి కూడా విజేతగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. బుధవారం వాంఖడే మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. లీగ్‌లో 100వ విజయం నమోదు చేసింది. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ముంబయి ఇండియన్స్‌ 175 మ్యాచులాడితే  అందులో 100 మ్యాచుల్లో విజయం సాధించింది. 56.85 శాతం విజయాలు సొంతం చేసుకుంది. ముంబయి తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఉన్నాయి. అయితే ఐపీఎల్‌ మొత్తంలో ఇప్పటి వరకూ ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించిందంటే..

జట్టు   మ్యాచులు గెలుపు
ముంబయి ఇండియన్స్‌ 175 100
చెన్నై సూపర్‌ కింగ్స్‌ 152 93
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 167 88
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 166 79
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 171 79
రాజస్థాన్‌ రాయల్స్‌ 132 71
దిల్లీ క్యాపిటల్స్‌ 165 69
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 171 83
రైజింగ్‌ పుణె సూపర్‌ గెయింట్స్‌ 30 15
గుజరాత్‌ లయన్స్‌ 30 13
పుణె వారియర్స్‌ ఇండియా 46 12
కోచి టస్కర్స్‌ కేరళ 14 6

                                 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.