close

తాజా వార్తలు

నా లక్ష్యం స్పష్టం: రాహుల్‌ గాంధీ 

నాగ్‌పూర్‌: కాంగ్రెస్ పార్టీ పేదరికం మీద మెరుపు దాడులు నిర్వహించనుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
‘కాంగ్రెస్‌ పార్టీ పేదరికం మీద మెరుపుదాడులు నిర్వహించనుంది. నరేంద్ర మోదీజీ రూ.15లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి సంవత్సరానికి రూ.72వేలు అందిస్తాం. అంటే ఐదేళ్ల కాలంలో ఆ మొత్తం 3,60,000. ఏది ఏమైనప్పటికీ నా లక్ష్యం మాత్రం స్పష్టం’ అని రాహుల్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ వలే తనకు అబద్ధాలు చెప్పడం మీద ఆసక్తి లేదని ఎద్దేవా చేశారు.  
రాహుల్ గాంధీ ఈ రోజు సోదరి ప్రియాంకతో కలిసి కేరళలోని వయనాడ్‌లో భారీ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం తాను పోటీ చేయనున్న రెండో స్థానం వయనాడ్ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.