close

తాజా వార్తలు

అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్‌!

విజయనగరం: ఎన్నికల వేళ అభిమానులు, కార్యకర్తల తీరు పార్టీ అధినేతలు, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రోడ్‌షోలో వైకాపా నేత వైఎస్ షర్మిల ఉంగరాన్ని లాక్కెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించగా.. తాజాగా విజయనగరంలో జనసేన బహిరంగ సభలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. వేదికపై పవన్‌ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా..   వెనుక నుంచి వచ్చిన  ఓ అభిమాని పవన్‌ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో ఆయన ఒక్కసారిగా తుళ్లిపడి వేదికపై కింద పడిపోయారు. మైక్‌ కూడా విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆయన్ని పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విజయనగరంలో అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదికపైకి పవన్‌ చేరుకున్న కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.