close

తాజా వార్తలు

శర్వా, సమంతల ప్రయాణం ఆరంభం

హైదరాబాద్‌: తమిళ హిట్‌ ‘96’ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మాతృకను తీసిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ 34వ సినిమా ప్రారంభమైందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ నెల చివర్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని పేర్కొంది. దీన్ని సామ్‌ రీట్వీట్‌ చేశారు. ‘ఇలాంటి చిత్ర బృందంతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆ దేవుడు మనతో ఉన్నారు’ అని రిప్లై ఇచ్చారు. ఈ చిత్రం కోసం శర్వా కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. బాగా గడ్డం పెంచారు.

‘96’లో త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించారు. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల మెప్పు పొందింది. పాఠశాలలో త్రిష, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం.. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం.. మళ్లీ ఓ సందర్భంలో కలుసుకోవడం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.