Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 79889
            [news_title_telugu_html] => 

ఏశాటే కాదు ఇంకా ఎన్నో..

[news_title_telugu] => ఏశాటే కాదు ఇంకా ఎన్నో.. [news_title_english] => Satellite-killer not a one-off India working on star wars [news_short_description] => ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత్‌.. ప్రస్తుతం అంతరిక్షంలో మరింత సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంతరిక్షంలో తన సంపదను ఎలక్ట్రానిక్‌, ఫిజికల్‌ దాడుల నుంచి రక్షించుకునేందుకు  [news_tags_keywords] => drdo,asat [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-07 23:13:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఏశాటే కాదు ఇంకా ఎన్నో.. - Satellite-killer not a one-off India working on star wars - EENADU
close

తాజా వార్తలు

ఏశాటే కాదు ఇంకా ఎన్నో..

దిల్లీ : ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత్‌.. ప్రస్తుతం అంతరిక్షంలో మరింత సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంతరిక్షంలో తన సంపదను ఎలక్ట్రానిక్‌, భౌతిక దాడుల నుంచి రక్షించుకునేందుకు గాను.. డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్స్‌(డీఈడబ్ల్యూ), కోఆర్బిటాల్‌ కిల్లర్‌ ఆయుధాలను అభివృద్ధి చేసే పనిలో ఉంది.

‘డీఈడబ్ల్యూ, లేజర్స్‌, ఎలక్ట్రోమాగ్నెటిక్‌ పల్స్‌, కో ఆర్బిటాల్‌ ఆయుధాలు తదితర సాంకేతికలను అభివృద్ధి చేసేందుకు మేం పనిచేస్తున్నాం. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేను. కానీ వాటిని ముందుకు తీసుకెళ్తాం’ అని డీఆర్‌డీవో చీఫ్‌ జి.సతీశ్‌రెడ్డి  శనివారం మీడియాతో అన్నారు. గత నెల 27న ఏశాట్‌ ప్రయోగాన్ని చేపట్టిన భారత్‌.. 283 కి.మీ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న మైక్రాశాట్‌-ఆర్‌ ఉపగ్రహాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా అంతరిక్షంలో వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సైతం ఛేదించే సామర్థ్యం భారత్‌కు సమకూరిందని సతీశ్‌ తెలిపారు.

కోఆర్బిటాల్‌ ఆయుధం అనేది ఓ ఉపగ్రహమే. అయితే దీనికి పేలుడు పదార్థాలు, ఆయుధాలను లేదా డీఈడబ్ల్యూలను అమర్చుతారు. ఈ ఉపగ్రహాన్ని మొదట కక్ష్యలో ప్రవేశపెట్టి ఆ తర్వాత.. శత్రు దేశాల ఉపగ్రహాల లక్ష్యంగా ప్రయోగిస్తారు. ఈ ఆయుధాలే కాకుండా ఇతర ఏశాట్‌ ఆయుధాలైన లేజర్‌జామర్లు, ఈఎంపీ తదితర ఆయుధాలను వేగంగా అభివృద్ధి చేసే పనిలో చైనా ఉంది. 2007 జనవరిలోనే డ్రాగన్‌ దేశం ఏశాట్‌ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.