Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 80334
            [news_title_telugu_html] => 

ఉపగ్రహాన్ని ‘మిషన్‌ శక్తి’ కూల్చిందిలా.. 

[news_title_telugu] => ఉపగ్రహాన్ని ‘మిషన్‌ శక్తి’ కూల్చిందిలా..  [news_title_english] => Defence ministry releases ASAT Video [news_short_description] => ‘మిషన్‌ శక్తి’తో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పేరు మార్మోగిపోయింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(ఏశాట్‌).. కక్ష్యలో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని విజయవంతంగా కూల్చేసింది. [news_tags_keywords] => Mission Shakti,A-SAT,Defence Ministry,DRDO [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 2 [news_videolink] => |https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FDefenceMinIndia%2Fvideos%2F266337090910421%2F [news_videoinfo] => |https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FDefenceMinIndia%2Fvideos%2F266337090910421%2F [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-08 10:33:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉపగ్రహాన్ని ‘మిషన్‌ శక్తి’ కూల్చిందిలా..  - Defence ministry releases ASAT Video - EENADU
close

తాజా వార్తలు

ఉపగ్రహాన్ని ‘మిషన్‌ శక్తి’ కూల్చిందిలా.. 

వీడియో విడుదల చేసిన రక్షణశాఖ

దిల్లీ: ‘మిషన్‌ శక్తి’తో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పేరు మార్మోగిపోయింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(ఏశాట్‌).. కక్ష్యలో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని విజయవంతంగా కూల్చేసింది. ఈ ప్రయోగంతో భూమి, ఆకాశం, సముద్రంతో పాటు అంతరిక్షంలోనూ పోరాటం సాగించగల సత్తా తమకుందని భారత్‌ చాటుకుంది. మరి ఈ మిషన్ శక్తి సాగిందెలా.. ఉపగ్రహాన్ని ఏశాట్‌ ఎలా కూల్చేసింది.. అన్నదానిపై రక్షణశాఖ మరింత స్పష్టతనిచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది. 

ఒడిశాలోని కలామ్‌ ఐలాండ్‌ నుంచి మార్చి 27న ఏశాట్‌ను ప్రయోగించారు. భూ ఉపరితలానికి 283 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉన్న ఓ పాత ఉపగ్రహాన్ని ఏశాట్‌ కేవలం 3 నిమిషాల్లోనే ఢీకొట్టింది. ఈ ప్రయోగంపై రక్షణశాఖ ఓ వీడియో రూపొందించింది.  ఉపగ్రహాన్ని ఏశాట్‌ ఎలా కూల్చేసిందో చెప్పేలా గ్రాఫిక్‌ డిజైన్లు, ఫొటోలతో వీడియో తయారుచేసింది. ఈ వీడియోను రక్షణశాఖ తమ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ఇటీవల పోస్టు చేసింది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగం సాగింది. మిషన్‌ శక్తి కోసం ఉపయోగించిన అధునాతన సాంకేతికత గురించి కూడా వీడియోలో చెప్పారు. 

సాంకేతికతను సవాల్‌ చేసేలా ప్రయోగం చేపట్టాలని ప్రధాని మోదీ 2014లో డీఆర్‌డీవోను ఆదేశించారు. ప్రధాని ఆదేశాల మేరకు 2016లో ‘మిషన్‌ శక్తి’ చేపట్టారు. ఈ ప్రయోగం గురించి చాలా తక్కువ మందికి తెలుసని డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 150 మంది శాస్త్రవేత్తలు ఈ మిషన్‌పై నిర్విరామంగా పనిచేశారని వీడియోలో పేర్కొన్నారు. 

మార్చి 27న క్షిపణి ప్రయోగం విజయవంతమైన తర్వాత ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగంతో మనం అమెరికా, రష్యా, చైనా తర్వాత అంతరిక్ష సైనిక శక్తి గల నాలుగో దేశంగా ఎదిగామని మోదీ తెలిపారు. కాగా.. ఏశాట్‌పై ప్రపంచవ్యాప్తంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏశాట్‌ పరీక్ష ద్వారా వచ్చే శకలాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి ముప్పు ఉందంటూ అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి. సతీశ్‌రెడ్డి.. ఈ శకలాలు ఐఎస్‌ఎస్‌ను ఢీ కొట్టే అవకాశాలు లేవని స్పష్టంగా చెప్పగలమని పేర్కొన్నారు. 45 రోజుల్లో శకలాలన్నీ విచ్ఛిన్నమవుతాయని స్పష్టం చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.