close

తాజా వార్తలు

భాజపాను ఓడించే సమర్థత కాంగ్రెస్‌కు లేదు..

బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు

లఖ్‌నవూ: భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లపై బహుజన్ సమాజ్‌ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. సరైన విధానాలు లేకపోవడం వల్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని, అసత్య హామీలు గప్పిస్తున్న భాజపా కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదని, అలీ, భజరంగ్‌ బలీ ఇద్దరూ తమ వైపునే ఉంటారని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌, ఎస్పీ-బీఎస్పీ అలీని నమ్ముకుంటే.. మాకు భజరంగ్‌ బలీపై విశ్వాసం ఉంది’ అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మేరఠ్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలకు మాయావతి కౌంటర్‌ ఇచ్చారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ ప్రాంతంలో బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాయావతి మాట్లాడుతూ... ‘అలీ, భజరంగ్‌ బలీ ఇద్దరూ మాకు చెందినవారే. నేను ముస్లింలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. భాజపాను ఓడించే సమర్థత కాంగ్రెస్‌కు లేదు. మా కూటమి మాత్రమే ఆ పార్టీని ఓడించగలదు. ఈ కూటమి గెలవాలని కాంగ్రెస్‌ కోరుకోవట్లేదు. ఆ పార్టీకి ఓట్లు వేయకండి. మీ ఓట్లు చీలడానికి వీల్లేదు. బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ నిలబెట్టిన అభ్యర్థికే ఓట్లు వేయండి’ అని మాయావతి వ్యాఖ్యానించారు.   


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.