close

తాజా వార్తలు

ముంబయికి బెంగళూరు లక్ష్యం 172

ముంబయి: ‘మిస్టర్‌ 360’ రెచ్చిపోయాడు. అర్ధశతకంతో దుమ్మురేపాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఏబీ డివిలియర్స్‌ (75; 51 బంతుల్లో 6×4, 4×6)కు తోడుగా మొయిన్‌ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) సమయోచిత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ముంబయి ఇండియన్స్‌కు 172 పరుగుల లక్ష్యం నిర్దేశించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. పార్థివ్‌ పటేల్‌ (28; 20 బంతుల్లో 4×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. విరాట్‌ కోహ్లీ (8) విఫలమయ్యాడు. ఏబీడీ ఆటతో బెంగళూరు 190 పరుగులు చేసేలా కనిపించింది. అయితే మలింగ వేసిన ఆఖరి ఓవర్లో డివిలియర్స్‌, అక్షదీప్‌ నాథ్‌ (0), పవన్‌ నేగి (0) వరుసగా ఔట్‌ కావడంతో కోహ్లీసేన 171/7కు పరిమితమైంది. ఈ మైదానంలో 192కు పైగా స్కోరు చేస్తేనే గెలుపు సాధ్యం. లేదంటే ఛేదించే జట్టుకే విజయం సులభమవుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.