close

తాజా వార్తలు

కిమ్‌తో సమావేశానికి సిద్ధం..

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో నాలుగోసారి సమావేశం కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ సోమవారం ప్రకటించారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ మధ్య ఇప్పటికి రెండు సార్లు చర్చలు జరిగిన విషయం తెలిసిందే.‌ ఈ చర్చల్లో ఈ ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. తాను మూడోసారి.. అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కిమ్‌ ఇటీవల ప్రకటించారు. అంతకు ముందు ఆయన దక్షిణ కొరియాపై విమర్శలు చేశారు. అమెరికా, ఉత్తరకొరియాకు మధ్య జరుగుతున్న చర్చల్లో దక్షిణ కొరియా చేస్తున్న మధ్యవర్తిత్వ తీరుపై ఆయన అభ్యంతరాలు తెలిపారు.

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ సోమవారం మాట్లాడుతూ... ‘ఉత్తరకొరియా ఎప్పుడు సిద్ధంగా ఉన్నా సరే.. మా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. కీలక, ఆచరణాత్మక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాం. ఉత్తరకొరియా, అమెరికా మధ్య రెండు సదస్సులు జరిగాయి. ఈ విషయంలో మరింత పురోగతి సాధించే క్రమంలో ఉత్తరకొరియాతో మరోసారి సదస్సులో పాల్గొనాలని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. అమెరికా, ఉత్తరకొరియా మధ్య అణ్వస్త్ర నిరోధ చర్చలు కొనసాగేలా చేయడానికి తమ దేశం చాలా ప్రాముఖ్యతనిస్తోందని ఆయన అన్నారు. అలాగే, ఆయన త్వరలోనే ఉత్తరకొరియాకు తమ ప్రతినిధులను పంపనున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా, గతేడాది ఈ ఇరు దేశాలకు మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. మరోవైపు గత వారం వాషింగ్టన్‌లో ట్రంప్‌తో మూన్‌ సమావేశమై చర్చించారు. ఉత్తరకొరియాతో చర్చలు జరపడం చాలా ముఖ్యమైన విషయమని ఇరు దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి.     


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.