close

తాజా వార్తలు

అజమ్‌గఢ్‌లో అఖిలేశ్‌ నామినేషన్‌

అజమ్‌గఢ్‌(యూపీ): లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం అజమ్‌గఢ్‌-మయు జాతీయరహదారి సమీపంలో ఆ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ముస్లిం- యాదవ్‌ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టుంది. గతంలో ఎస్పీ కురువృద్ధుడు, అఖిలేశ్‌ తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో కనౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్‌ గెలుపొందారు. 2012లో ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఎంపీగా రాజీనామా చేశారు. అనంతరం అక్కడి నుంచి అఖిలేశ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ పోటీ చేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా దిలేశ్‌ లాల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. మే12న అజమ్‌గఢ్‌లో పోలింగ్‌ జరగనుంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.