close

తాజా వార్తలు

ఇంటర్‌ ఫలితాలు గ్రేడ్‌ల వారీగా ఇలా..

ఫలితాల్లో బాలికలదే హవా

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి ప్రకటించిన ఈ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. మెదక్‌ ఆఖరు స్థానంలో నిలిచింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ద్వితీయ సంవత్సరంలో 65శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. 2018లో ప్రథమ ఇంటర్‌లో 62.73 శాతం నమోదు కాగా.. ఈ ఏడాది ఉత్తీర్ణత 60.5 శాతం మాత్రమే. అలాగే గతేడాది ద్వితీయ ఇంటర్‌లో 67.06 శాతం నమోదవ్వగా.. ఈసారి మాత్రం 64.8 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది వెల్లడైన ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణతను  గ్రేడ్ల వారీగా పరిశీలిస్తే..

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం
ఏ గ్రేడ్‌- 1,28,913 (52.1శాతం)
బి గ్రేడ్‌- 70,054 (28.3శాతం)
సి గ్రేడ్‌- 33,449 (13.5శాతం)
డి గ్రేడ్‌- 14,991 (6శాతం)

బాలికల ఉత్తీర్ణత: 66 శాతం
బాలుర ఉత్తీర్ణత : 55 శాతం

ద్వితీయ సంవత్సరం

ఏ గ్రేడ్‌- 1,49,574 (60.4 శాతం)
బి గ్రేడ్‌- 65,388 (26.4శాతం)
సి గ్రేడ్‌- 25,013 (10.1శాతం)
డి గ్రేడ్‌- 7,780 (3.1శాతం)

బాలికల ఉత్తీర్ణత: 70.8 శాతం
బాలుర ఉత్తీర్ణత: 58.2 శాతం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.