close

తాజా వార్తలు

‘పబ్‌జీని నిలిపివేయండి’

గూగుల్‌కు లేఖ రాసిన రాజ్‌కోట్‌ పోలీసులు

రాజ్‌కోట్(గుజరాత్‌): టిక్‌టాక్‌ యాప్‌ను ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌ల నుంచి తొలగించాలని ఆయా సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించి టిక్‌టాక్‌ వినియోగదారులను నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పబ్‌జీ యాప్‌పై కూడా గూగుల్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ తమ ప్రాంతంలో డౌన్‌లోడ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని రాజ్‌కోట్ పోలీసులు గూగుల్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ గేమ్‌ను ఇప్పటికే నిషేధించింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి ఏదైనా ఐపీ అడ్రస్‌తో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని ప్రయత్నిస్తే డౌన్‌లోడ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని’ అని గూగుల్‌కు లేఖ రాసినట్లు రాజ్‌కోట్‌ పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ గేమ్‌ చిన్నారులు, విద్యార్థులపై దుష్ప్రభావం చూపుతోందని, అందుకే దీన్ని రాష్ట్రంలో నిషేధించామని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు. గుజరాత్‌లో పబ్‌జీ నిషేధం తరువాత కూడా ఈ గేమ్‌ ఆడుతున్న కొంతమందిని పోలీసులు అరెస్టు చేసి, కేసులు కూడా నమోదు చేశారు. దేశంలో పబ్‌జీని నిషేధించిన ఏకైక రాష్ట్రం గుజరాత్‌. అయితే రాజ్‌కోట్‌ పోలీసుల లేఖపై గూగుల్‌ ఇంకా స్పందించలేదు. ఒకవేళ ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్తే టిక్‌టాక్‌ మాదిరిగానే పబ్‌జీపై కూడా వేటు పడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత కొద్ది నెలలుగా ఈ ఆన్‌లైన్‌ గేమ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.