close

తాజా వార్తలు

ఓటమి భయంతోనే నా మీద విమర్శలు  

ప్రధాని మోదీపై మమత మండిపాటు

పానిఘట  : ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్‌ అనంతరం దీదీకి నిద్ర పట్టడం లేదని మోదీ వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పానిఘటలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

‘ఓటమి భయంతోనే ప్రధాని మోదీ నా మీద విమర్శలు చేస్తున్నారు. ఆయనకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు. దాని గురించి ఆలోచిస్తూ ఆయన ప్రతిరోజు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, న్యూదిల్లీ, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ, గుజరాత్‌, ఒడిశా, మిగతా రాష్ట్రాల్లో మే 23 తర్వాత భాజపా ఉంటుందో లేదో అని ఆయన భయపడుతున్నారు. భాజపా త్రిపురలో ఎన్ని సీట్లు గెలుస్తుందో నాకు తెలీదు. కానీ ఆ రాష్ట్రం మాత్రమే భాజపాకు 543 స్థానాలు తెచ్చిపెట్టదు కదా!.  అందుకే ఆయన బెంగాల్‌ చుట్టూ తిరిగి మత ప్రాతిపదికన ప్రజలను వేరుచేస్తూ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు’ అంటూ ఆరోపించారు.

ముఖ్యమంత్రిగా దీదీ బెంగాల్‌కు చేసిందేమీ లేదంటూ భాజపా ఆరోపించడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. భాజపా ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్తారన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలెంతటి అసహనానికి గురయ్యారో ఎన్నికల ఫలితాల్లో వారికి తెలిసోస్తుందని పేర్కొన్నారు.

బునియాద్‌పూర్‌ ప్రచార సభలో ప్రధాని మోదీ..మమతాపై విమర్శల వర్షం కురిపించారు.  టీఎంసీ ఎన్నికల నినాదం మా, మాటీ, మనుష్‌(మాతృమూర్తి, మాతృభూమి, మనుషులు) పేరిట ప్రజల్ని ఆమె మోసం చేస్తున్నారని విమర్శించారు. అలాగే బంగ్లాదేశ్‌ నటులను టీఎంసీ ప్రచారంలో భాగం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మైనారిటీ ఓటర్లను ప్రలోభపెట్టడానికే టీఎంసీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బాలాకోట్‌ దాడులను ఆధారాలు అడుగుతున్న మమతా.. తొలుత చిట్‌ ఫండ్‌ కుంభకోణం నిందితులను పట్టుకోవాలని హితవు పలికారు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.