close

తాజా వార్తలు

అగ్ర నాయకిలు అక్కడ నుంచే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అవద్‌ రీజియన్‌లోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు గత కొన్ని రోజులుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్రమంత్రులు మేనకాగాంధీ, స్మృతి ఇరానీ లాంటి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నారీమణులు ఈ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తుండడమే దీనికి కారణం. ఇంకా ఎవరెవరు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం.. 
* యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సోనియా తన భర్త రాజీవ్‌గాంధీ మరణానంతరం అమేఠీ నుంచి పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. తరువాత ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆమె రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
* గాంధీ కుటుంబం నుంచి వచ్చిన మరో మహిళా నాయకురాలు, కేంద్రమంత్రి మేనకాగాంధీ భాజపా అభ్యర్థిగా సుల్తాన్‌పూర్‌ స్థానం నుంచి ఈ ఎన్నికల బరిలో నిలిచారు. 2014 వరకు ఆమె  పిలిభిత్‌ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సుల్తాన్‌పూర్‌ స్థానం నుంచి ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ 2014 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో తల్లి స్థానంలో కుమారుడు, కుమారుడి స్థానంలో తల్లి పోటీ చేస్తుండటం గమనార్హం. 
* కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై భాజపా అభ్యర్థిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రెండోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉత్కంఠ పోరుకు అమేఠీ నియోజకవర్గమే వేదికైంది. 2014 ఎన్నికల్లోనూ రాహుల్‌పై స్మృతి ఇరానీ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.
* 2014 ఎన్నికల్లో బిహార్‌లోని పట్నాసాహిబ్‌ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన శతృఘ్న సిన్హా ఆ తరువాత భాజపా రెబల్ ఎంపీగా మారారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయితే అతడి భార్య పూనమ్‌ సిన్హా మాత్రం భర్త దారిలో కాకుండా సమాజ్‌వాదీ పార్టీలో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎన్నికల్లో లఖ్‌నవూ స్థానం నుంచి ఆమె కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌పై పోటీకి సిద్ధమయ్యారు. 
*  ఉత్తరప్రదేశ్‌ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు రీతా బహుగుణ కూడా ఇదే పరిధిలోని అలహాబాద్‌ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
* కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రాజా దినేశ్‌ ప్రతాప్‌సింగ్‌ కుమార్తె రాజ్‌కుమారీ రత్నా సింగ్‌ కూడా ప్రతాప్‌ఘర్‌ స్థానం నుంచి నాలుగోసారి బరిలో నిలిచారు. ఆమె ఇంతకు ముందు ఇదే సెగ్మెంట్‌ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
   అయితే ఈ ఏడు నియోజకవర్గాల బరిలో ఉన్న మహిళా నాయకురాల్లో స్మృతి ఇరానీ తప్ప.. మిగతా వాళ్లంతా ఏదో ఒక విధంగా కాంగ్రెస్‌తో సంబంధమున్న వాళ్లే కావడం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 80 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న అమేఠీ యూపీలోనే ఉన్నాయి.  ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ పూర్తి కాగా, మరో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.