Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 89132
            [news_title_telugu_html] => 

పంత్‌ బాధపడొద్దు: గంగూలీ

[news_title_telugu] => పంత్‌ బాధపడొద్దు: గంగూలీ [news_title_english] => Pant will play for India for next 15 years says Ganguly [news_short_description] => ప్రస్తుత ప్రపంచ కప్‌నకు ఎంపికవ్వకపోవడం బాధ కలిగించినా రిషభ్ పంత్‌ కనీసం 15 ఏళ్లు టీమిండియాకు ఆడతాడని మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అన్నాడు. .... [news_tags_keywords] => rishabh pant,worldcup 2019,saurav ganguly [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-25 17:40:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పంత్‌ బాధపడొద్దు: గంగూలీ - Pant will play for India for next 15 years says Ganguly - EENADU
close

తాజా వార్తలు

పంత్‌ బాధపడొద్దు: గంగూలీ

ఈ సారి కాకపోతే అతడు మరెన్నో ప్రపంచకప్‌లు ఆడతాడు

టీమిండియాకు 15 ఏళ్లు ప్రాతినిథ్యం వహిస్తాడు

కోల్‌కతా: ప్రస్తుత ప్రపంచ కప్‌నకు ఎంపికవ్వకపోవడం బాధ కలిగించినా రిషభ్ పంత్‌ కనీసం 15 ఏళ్లు టీమిండియాకు ఆడతాడని మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అతడు చాలా ప్రపంచకప్‌లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అనుభవం, అంతర్జాతీయ మ్యాచుల్లో ఒత్తిడి దృష్ట్యా పంత్‌ను కాదని దినేశ్‌ కార్తీక్‌ను సెలక్టర్లు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

పంత్‌ బెస్ట్‌

‘ధోనీ శాశ్వతంగా ఏమీ ఆడడు. డీకే సైతం శాశ్వతం కాదు. రిషభ్ పంతే తర్వాతి అత్యుత్తమ కీపర్‌. అతడు కచ్చితంగా భారత భవిష్యత్తు. కార్తీక్‌ అతడి కన్నా 15-16 ఏళ్లు ముందున్నాడు. ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం పెద్ద దెబ్బేమీ కాదు. దీనిని నేను సమస్యగానే భావించడం లేదు. పంత్‌ ఈ ప్రపంచకప్‌ ఆడకపోవచ్చు గానీ తర్వాత ఎన్నో మెగా టోర్నీలు ఆడతాడు. ఇక్కడితో దారులేమీ మూసుకుపోలేదు’ అని గంగూలీ అన్నాడు.

కోహ్లీసేన సమతూకం

ఒక సెలక్టర్‌గా తానైతే పంత్‌ను ఎంచుకుంటానని దాదా అన్నాడు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టు సమతూకంగా ఉందన్నాడు. ‘నేనైతే కచ్చితంగా పంత్‌నే ఎంచుకుంటా. దినేశ్‌ కార్తీక్‌ సైతం మంచి ఆటగాడే. జట్టు చాలా బాగుంది. ఎక్కువ మందికి మొండిచేయి చూపించారని అనుకోవడం లేదు. రిషభ్ ఉంటే బాగుండేది. కానీ అలా జరిగిపోయింది’ అని సౌరవ్‌ అన్నాడు.

ఫాస్ట్‌ పిచ్‌లు ఇష్టం

ప్రపంచకప్‌కు ఎంపికవ్వని పంత్‌ను దాదా ఓదార్చాడు. ‘అతడి వయసు 21 ఏళ్లే. ఇదే విషయం అతడితో చెప్పా. కొన్ని రోజులు బాధగా ఉంటుంది. ఆ తర్వాత కోలుకుంటాడు. దిల్లీ కన్నా ఇతర మైదానాల్లోనే రిషభ్ అద్భుతంగా ఆడగలడు. బంతి బ్యాటు మీదకు వచ్చే ఫాస్ట్‌ పిచ్‌లపై అతడు బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాడు’ అని జైపుర్‌లో పంత్‌ ఇన్నింగ్స్‌ గురించి గంగూలీ వివరించాడు. గెలిచిన తర్వాత అతడిని దాదా ఎత్తుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ట్వీట్‌ చేస్తూ ‘రిషభ్ పంత్‌ నువ్విందుకు అర్హుడివే.. వావ్‌’ అని ఓ వ్యాఖ్య పెట్టాడు. ఇది చాలా మందికి లార్డ్స్‌ బాల్కనీలో దాదా సంబరాలని గుర్తుకుతెచ్చింది.

పాత అలవాటు కదా!

‘ఏం చేస్తాం? పాత అలవాట్లు అంత సులభంగా పోవుగా. జట్టును విజయవంతంగా నడిపించేందుకు ఎంతో అంకితమవుతాం. మరి గెలిచినప్పుడు చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది కదా (పంత్‌ను ఎత్తుకోవడాన్ని ఉద్దేశిస్తూ). ఎడమచేతి వాటం కాబట్టి శిఖర్ ధావన్‌కు నేను సాయం చేయగలను. టోర్నీ మధ్యలో నైపుణ్యాల గురించి ఎక్కువ మాట్లాడొద్దు. ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో మాత్రమే చెప్పాలి. భారత్‌లో మిగతా వారితో పోలిస్తే ధావన్‌ వన్డే రికార్డు చాలా బాగుంది. అతనెంతో ప్రతిభాశాలి. సన్‌రైజర్స్‌ తరఫున మెరుగైన రికార్డుంది. చాలా మంచి ఆటగాడు’ అని దాదా వెల్లడించాడు.

మేమొక్కటీ గెలవలేదు

పాయింట్ల పట్టికలో దిల్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ముందు రెండో స్థానంలో ఉన్న కోల్‌కతా వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి ఆరో స్థానానికి దిగజారింది. ఈడెన్‌లో దిల్లీ చేతిలోనూ ఓడింది. దీనిపై దాదా ఆచితూచి స్పందించాడు. ‘కోల్‌కతా రెండు సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. మేమైతే ఒక్కసారీ గెలవలేదు. మ్యాచ్‌ పరిస్థితులను బట్టి దిల్లీకి సలహాలు ఇవ్వడం వరకే నా పాత్ర పరిమితం. జట్టును ఎంపిక చేయడమే ఐపీఎల్‌లో అత్యంత కీలకం. సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకొనేందుకు ఎక్కువ సమయం దొరకదు. అందుకే సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకొని గెలుపు దారి వెతకాలి’ అని దాదా అన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.