close

తాజా వార్తలు

రైలు పైకెక్కి.. విద్యుత్తు తీగలను తాకి..!

బెంగళూరులో యువకుడి మృతి

కర్ణాటక: బెంగళూరు మేజిస్టిక్‌ రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం సరిగాలేని ఓ యువకుడు రైల్వేలైనుకు చెందిన విద్యుత్తు తీగలను తాకి మృతి చెందాడు. స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుపైకెక్కిన అతను ఆత్మహత్య చేసుకుంటానంటూ అక్కడున్న ప్రయాణికులను బెదిరించాడు. దీంతో ఆ యువకుడిని కిందకు దించడానికి కొందరు ప్రయత్నించారు. అంతలో రైలు పైనున్న విద్యుత్తు తీగలను తాకి అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు కర్నూలుకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.