close

తాజా వార్తలు

హిట్‌మ్యాన్‌ అవెంజర్స్‌లో చేరే సమయం వచ్చింది    

రోహిత్‌శర్మని ఉద్దేశించి హార్దిక్‌పాండ్య ట్వీట్‌ 

చెన్నై: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ అవెంజర్స్‌లో చేరే సమయం ఆసన్నమైందని అంటున్నాడు ఆ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయి బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో తొలిసారి అర్ధశతకం సాధించాడు. దీంతో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ను ఉద్దేశిస్తూ పాండ్య పై విధంగా ట్వీట్‌ చేశాడు. 

క్వింటన్‌ డికాక్‌తో కలిసి ముంబయికి మంచి ఓపెనింగ్‌ అందించిన రోహిత్‌శర్మ(67; 48 బంతుల్లో 6x4, 3x6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు చక్కటి షాట్లతో అలరించగా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 12 ఓవర్లకు 99/1 పటిష్ఠస్థితిలో ఉన్న ముంబయి 20 ఓవర్లకు 155 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఓ మాదిరి స్కోర్‌ సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై మొదటి నుంచీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా మురళీవిజయ్‌(38; 35 బంతుల్లో 3x4, 1x6) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో 46 పరుగుల తేడాతో ఓటమిచవిచూసింది. 
మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ధోనీ లేకపోవడం తమకు చాలా కలిసొచ్చిందని, అతడి వల్లే చెన్నైకి ఎన్నో విజయాలు సొంతమయ్యాయని అన్నాడు. ఛేదనలో ధోనీ లేకపోతే చెన్నైకి కష్టాలు తప్పవని, అయితే అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతడు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి తలెత్తిందని వివరించాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.