close

తాజా వార్తలు

సమంత పుట్టినరోజు.. ఎవరేమన్నారంటే..?

‘ది బెస్ట్‌’ వ్యక్తికి శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: చిలిపితనం, మంచితనం, పెంకితనం, చూడచక్కటి అందం.. వీటన్నింటినీ కలగలిపితే సమంత. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి తన శ్రమతో నేడు అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారు. తన గొప్ప వ్యక్తిత్వంతో అక్కినేని వారసుడు నాగచైతన్య మనసు దోచి ఆ ఇంటికి కోడలయ్యారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆమె ఆదివారం తన 32వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో సామ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖులతోపాటు అభిమానులు కూడా విష్‌ చేశారు. హన్సిక, తమన్‌, వెన్నెల కిశోర్‌, రష్మిక, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. వీరందరికీ సమంత పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.

తమన్‌: జన్మదిన శుభాకాంక్షలు ప్రియమైన సమంత. హ్యాపీ మ్యూజికల్‌ బర్త్‌డే. నీకు ఈ ఏడాది మొత్తం సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి.
వెన్నెల కిశోర్‌: నీ కోసం నా ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌ మార్చా సమంత. హ్యాపీ బర్త్‌డే.
హన్సిక: పుట్టినరోజు శుభాకాంక్షలు అందమైన సమంత. ఎప్పుడూ సంతోషంగా ఉండు.

రష్మిక: హ్యాపీ బర్త్‌డే సమంత మామ్‌. పుట్టినరోజు నాడు కేక్‌లు, అందరి ప్రేమతో ఎంజాయ్‌ చేయండి. నీ అభిమాని రష్మిక.
సురేశ్‌ ప్రొడక్షన్స్‌: సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
రకుల్‌ప్రీత్‌ సింగ్‌: అందమైన వ్యక్తి సమంతకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది సంతోషం, నవ్వులతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఓ వ్యక్తిగా నువ్వు నాకు స్ఫూర్తిదాయకం. ఇలాగే ఆదర్శంగా జీవించు.
అనుపమ పరమేశ్వరన్‌: క్యూట్‌ సామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి.
కోన వెంకట్‌: ది బెస్ట్‌ వ్యక్తికి నా బెస్ట్‌ విషెస్‌. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలి.
రానా: హ్యాపీ హ్యాపీ టు యు సిస్టర్‌.

సుశాంత్‌: పుట్టినరోజు శుభాకాంక్షలు సామ్‌. ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌.. అందరికీ ఇలాగే స్ఫూర్తిగా ఉండు.
త్రిష: హ్యాపీ బర్త్‌డే సామ్‌. ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా రాణించు.

మహేశ్‌ కోనేరు: దయ, నైపుణ్యం ఉన్న లవ్లీ సమంతకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు అన్నింటిలోనూ ది బెస్ట్‌ లభించాలని కోరుకుంటున్నా.

అతుల్యా రవి: అందమైన, అంకితభావం కల్గిన సమంతకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది నీకు విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా.
అన్నపూర్ణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న వారందరి తరఫున సమంతకు హ్యాపీ బర్త్‌డే.
అనుపమ రాగ్‌: పుట్టినరోజు శుభాకాంక్షలు సమంత.
జి.ధనంజయన్‌: ఎంతో నైపుణ్యం కల్గిన సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది మొత్తం సంతోషం, విజయాలు చేకూరాలని కోరుకుంటున్నా.

చిన్మయి: రాక్‌స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే. ప్రతి విషయంలోనూ నీకు ది బెస్ట్‌ లభించాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.