close

తాజా వార్తలు

మహారాష్ట్రలో మావోయిస్టుల దుశ్చర్య

గచ్చిరోలిలో 36 వాహనాల దగ్ధం

గచ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గచ్చిరోలి ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన వాహనాలకు నిప్పుపెట్టారు. దాదాపూర్‌ పరిధిలోని కురకేదా తాలూకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పురాందా-మాలేగావ్-యెర్కద్‌ జాతీయ రహదారి నిర్మాణ పనులను అమర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే సంస్థ చేస్తోంది. ఈ కంపెనీకి దాదాపూర్‌లో దాదర్‌ ప్లాంట్‌ ఉంది. రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఈ ప్లాంట్‌లోనే నిలిపి ఉంచారు. మంగళవారం రాత్రి దాదాపు 150 మంది నక్సలైట్లు ప్లాంట్‌లోకి చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 36 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటిలో జెనరేటర్లు, పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకర్లు, రోడ్డు రోలర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు ఘటనాస్థలంలో నక్సలైట్లు కరపత్రాలు వదిలివెళ్లారు. కాగా.. ఘటనలో దాదాపు రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.