close

తాజా వార్తలు

ముంబయిదే ‘సూపర్‌ ఓవర్‌’

ముంబయి: వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్‌కు చేరుకున్న మూడో జట్టుగా ముంబయి నిలిచింది. సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ 8 పరుగులకే పరిమితం అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 3 బంతుల్లోనే మ్యాచ్‌ గెలిచింది. ఓపెనర్లుగా వచ్చిన హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌ స్వల్ప లక్ష్యాన్ని 3 బంతుల్లోనే ముగించారు. సూపర్‌ ఓవర్‌లో హార్దిక్‌ మొదటి బంతినే సిక్సర్‌గా మలచడంతో ముంబయి విజయం లాంఛనమైంది. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(69, 58 బంతుల్లో 6x4, 2x6) అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు. అతడికి రోహిత్‌శర్మ(24), సూర్యకుమార్‌ యాదవ్‌(23) కొంతమేర సహకరించారు. వారిద్దరూ ఔటయ్యాక హార్దిక్‌ పాండ్య(18) క్రీజులోకి వచ్చినా పెద్దగా రాణించలేదు. అనంతరం కీరన్‌పొలార్డ్‌(10) కూడా విఫలం కావడంతో ముంబయి.. హైదరాబాద్‌ ముందు స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది. హైదరాబాద్‌ బౌలర్లలో ఖలీల్‌అహ్మద్‌ మూడు వికెట్లు తీయగా భువనేశ్వర్‌, మహ్మద్‌ నబీ చెరో వికెట్‌ తీశారు.

మనీశ్‌ పాండే ఒంటరి పోరు..

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. హైదరాబాద్‌ జట్టులో మనీశ్‌ పాండే(71 నాటౌట్: 47 బంతుల్లో  8x4, 2x6)ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్‌ నబీ(31) రాణించాడు. ముంబయి బౌలర్లలో బుమ్రా, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా తలో రెండు వికెట్లు తీశారు. 

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.